వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌ ఎపిసోడ్: సండ్రకు టిడిఎల్పీ పగ్గాలు , 3 ఏళ్ళలో మూడోవ్యక్తికి పగ్గాలు

తెలంగాణ అసెంబ్లీలో టిడిఎల్పీ నేతగా సండ్ర వెంకటవీరయ్యను నియమించే అవకాశం కన్పిస్తోంది. రేవంత్‌రెడ్డి టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం దక్కనుందని పార్టీ వర్గాల

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టిడిఎల్పీ నేతగా సండ్ర వెంకటవీరయ్యను నియమించే అవకాశం కన్పిస్తోంది. రేవంత్‌రెడ్డి టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం దక్కనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో 15 మంది ఎమ్మెల్యేలు గెలిచింది టిడిపి.అసెంబ్లీలో టిడిపికి ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే: రేవంత్‌కు అగ్ని పరీక్షేనా?కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే: రేవంత్‌కు అగ్ని పరీక్షేనా?

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: ఆ ముగ్గురిపైనే అందరి దృష్టిరేవంత్‌రెడ్డి ఎపిసోడ్: ఆ ముగ్గురిపైనే అందరి దృష్టి

వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్

రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?

2014 ఎన్నికల్లో 15 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీటును టిఆర్ఎస్‌ కైవసం చేసుకొంది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు టిడిపిని తీవ్రంగా దెబ్బతీశాయి. టిడిపి ఎమ్మెల్యేలు 12 మంది టిఆర్ఎస్‌లో చేరారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కూడ టిడిపిని వీడి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.

ఈ నెల 27వ, తేదివరకు తెలంగాణ అసెంబ్లీలో టిడిపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో రెండుకు చేరుకొంది.శాసనమండలిలో ఆ పార్టీ ప్రాతినిథ్యం కోల్పోయింది.

టిడిఎల్పీ నేతగా వెంకటవీరయ్య

టిడిఎల్పీ నేతగా వెంకటవీరయ్య

తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కలిసొచ్చింది. రేవంత్ రాజీనామాతో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత పదవి ఆయనకు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నప్పటికీ, ఆయన క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనక పోవడం, టీడీపీకి అంటీముట్టనట్టుగా ఉంటుండటంతో టీడీపీఎల్పీ పదవి సండ్ర వెంకటవీరయ్యకు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం నాటికి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

మూడేళ్ళలో ఎల్పీనేతగా మూడో వ్యక్తి

మూడేళ్ళలో ఎల్పీనేతగా మూడో వ్యక్తి

తెలంగాణ అసెంబ్లీలో 2014లో టిడిఎల్పీ నేతగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉండేవారు. దయాకర్‌రావు శాసనసభపక్ష నేతగా ఉన్న సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు టిడిపిని వీడారు. టిఆర్ఎస్‌లో చేరారు. దీంతో దయాకర్‌రావును శాసనసభపక్ష నేతగా మార్చేశారు. ఆయన స్థానంలో రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ పోరాటం సాగించారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులతో రేవంత్‌ టిడిపికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. రేవంత్ స్థానంలో సండ్ర వెంకటవీరయ్యను టిడిఎల్పీ నేతగా నియమించనున్నారు.

టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలే

టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలే

2014 అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జరిగిన కొన్ని అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు, ప్రభుత్వం లక్ష్యంగా అసెంబ్లీలో గొడవ జరిగింది. రేవంత్‌రెడ్డిని అసెంబ్లీలో ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొన్న సందర్భాలు కూడ లేకపోలేదు. కొన్ని సమయాల్లో టిడిపి ఎమ్మెల్యేలపై అసెంబ్లీ నుండి సస్పెన్షన్ వేటేశారు. ఈ పరిణామాల తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీలో టిడిపి తరపున వాణిని విన్పించే రేవంత్ అసెంబ్లీలో ప్రస్తుతానికి ఈ సమావేశాలకు హజరుకాడు. అయితే సండ్ర వెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్యలు తమ వాణిని విన్పించే అవకాశం ఉంది.

రాజకీయ సమీకరణాల్లో మార్పులు

రాజకీయ సమీకరణాల్లో మార్పులు

రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు. కెసిఆర్ వ్యతిరేకులు, కెసిఆర్ అనుకూల శక్తుల పునరేకీకరణ సాగుతోందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రాజకీయాల్లో మార్పులు చేర్పులకు అవకాశం కన్పిస్తోంది. ఎన్నికల వేడి ఇప్పటికే తెలంగాణ ప్రారంభమైంది. దరిమిలా ఇంకా రాజకీయాల్లో ఉహించని మార్పులు చోటుచేసుకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Sandra Venkata Veeraiah will get TDLP post.Revanth Reddy resigned to MLA post. So TDP chief Chandrababunaidu will take decission on TDLP post before Monday.TDLP leaders changed in Three years period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X