హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తులు ఆయన పేరిటే: సంగీత కేసులో ఎంపీ మల్లారెడ్డి ట్విస్ట్, ఆరో రోజు దీక్ష

ర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న సంగీత కేసులో టీఆర్ఎస్ నాయకులు, ఎంపీ మల్లారెడ్డి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆయన ఇరువర్గాలతో చర్చలు సాగిస్తున్నారు. సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టించే ప్రయత్నాలు చేస్తున్న

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న సంగీత కేసులో టీఆర్ఎస్ నాయకులు, ఎంపీ మల్లారెడ్డి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆయన ఇరువర్గాలతో చర్చలు సాగిస్తున్నారు. సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

చదవండి: సంగీత కేసులో ట్విస్ట్: ఎంపీ వెళ్లగానే అరెస్ట్, ప్రశ్నలెన్నో, హోటల్లో సెటిల్మెంట్ యత్నం

అదే విషయం చెబుతున్న సంగీత

అదే విషయం చెబుతున్న సంగీత

సంగీత తనకు ఆస్తులు అవసరం లేదని, తనను భార్యగా అంగీకరించాలని, తనకు, తన కూతురుకు రక్షణ కావాలని, తన కూతురు భవిష్యత్తుకు హామీ కావాలని సంగీత కోరుతున్నారు. తనను ఇటీవల ఎంపీ మల్లారెడ్డి కలిసినప్పుడు కూడా ఆమె అదే విషయం చెప్పారు.

మల్లారెడ్డి పదేపదే చర్చలు

మల్లారెడ్డి పదేపదే చర్చలు

ఆరు రోజులుగా ఆమె డిమాండ్ చేస్తోంది కూడా తనకు, తన పాపకు రక్షణ, తన కూతురు భవిష్యత్తు. మరోవైపు మల్లారెడ్డి ఇరువైపుల కుటుంబాలతో శుక్రవారం మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులపై ఆసక్తికరం

ఆస్తులపై ఆసక్తికరం

సంగీతకు ఏమీ ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని మల్లారెడ్డి తెలిపారు. ఆస్తుల గురించి మాట్లాడుతూ.. ఆస్తులు అన్నీ సంగీత మామ పేరిట ఉన్నాయని తెలిపారు. అతనితో చర్చించి నిర్ణయంం తీసుకుంటామని చెప్పారు. సంగీతకు న్యాయం చేస్తామన్నారు.

సంగీత పాప పేరిట ఒకటి రాయిస్తామని చెప్పిన మల్లారెడ్డి

సంగీత పాప పేరిట ఒకటి రాయిస్తామని చెప్పిన మల్లారెడ్డి

సంగీత భర్త కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయని, నాలుగైదు భవనాలు ఉన్నాయని, అందులో ఒక దానిని పాప పేరిట రాయిస్తామని మల్లారెడ్డి.. సంగీతకు చెప్పారు. ఇప్పుడు ఆస్తులు సంగీత మామ పేరిట ఉన్నాయని, ఆయనతో చర్చిస్తామని చెప్పారు.

సంగీత ఏమన్నారంటే

సంగీత ఏమన్నారంటే

మరోవైపు, సంగీత మాట్లాడుతూ.. గతంలో తాను ఏమి అడిగానో ఇప్పుడు కూడా అవే అడుగుతున్నానని చెప్పారు. మల్లారెడ్డి వెళ్లి తన భర్త, అత్తమామలతో చర్చించి వచ్చి విషయం చెబుతానని తనకు తెలిపారని అన్నారు. తనను భార్యగా అంగీకరించాలని, తన కూతురుకు భవిష్యత్తు ఉండాలని సంగీత కోరుకుంటున్నారు. కాగా సంగీత దీక్ష శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకుంది.

English summary
Sangeetha's protest enters sixth day in Uppal, Hyderabad. MP Malla Reddy has met her husband Srinivas Reddy and Srinivas Reddy's mother, father in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X