హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకాతో కలిసి వేదికపై కేటీఆర్: రామ్ చరణ్, సానియాల ప్రసంగం

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌కు హెచ్ఐసీసీ ముస్తాబు అయింది. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు, రాయబారులు, ఇతర ప్రముఖుల కోసం ముందు వరుసలో సోఫాలు వేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Global Entrepreneur Summit 2017 : Ram Charan's Speech At GES

హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌కు హెచ్ఐసీసీ ముస్తాబు అయింది. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు, రాయబారులు, ఇతర ప్రముఖుల కోసం ముందు వరుసలో సోఫాలు వేశారు. ఆ తర్వాత ప్రతినిధులు కూర్చుంటారు.

ఇవాంకా, మోడీల కోసం ఆ రోడ్లు మొత్తం ఖాళీ, 45 ని.ల్లో వెళ్లేలా ప్లాన్: పోలీసులకు సవాల్ఇవాంకా, మోడీల కోసం ఆ రోడ్లు మొత్తం ఖాళీ, 45 ని.ల్లో వెళ్లేలా ప్లాన్: పోలీసులకు సవాల్

సదస్సుకు 1500 మంది వస్తున్నారు. నిర్వాహకులు, భద్రతా బలగాలు కలుపుకొని రెండువేల మందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ కనిపించేలా ఎత్తైన వేదికను, మూడు డిజిటల్ థియేటర్లు ఏర్పాటు చేసారు.

 వేదిక పంచుకోనున్న ఇవాంకా, కేటీఆర్

వేదిక పంచుకోనున్న ఇవాంకా, కేటీఆర్

నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, పర్యవేక్షణ ద్వారా పనిచేసే వారిలో మహిళల వాటా పెంచడంపై బుధవారం ఉదయం ప్లీనరీ సదస్సు నిర్వహిస్తారు. దీనిలో ఇవాంక ట్రంప్‌తో కలిసి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ వేదిక పంచుకోనున్నారు. పనిచేసే చోట మహిళలకు అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తారు.

 సమన్వయకర్తగా మంత్రి కేటీఆర్

సమన్వయకర్తగా మంత్రి కేటీఆర్

బ్రిటన్‌ మాజీ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్‌ భార్య చెరీ బ్లెయిర్‌, డెల్‌ ఈఎంసీ చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ కరేన్‌ క్విన్‌టోస్‌, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్‌ తదితరులు ప్రసంగిస్తారు. సమన్వయకర్తగా మంత్రి కేటీఆర్‌ ఉంటారు.

 ప్రసంగించే ప్రముఖులు

ప్రసంగించే ప్రముఖులు

సదస్సులో పలువురు ప్రముఖులు మాట్లాడనున్నారు. ఫేస్‌బుక్ ఉపధ్యక్షులు అశుతోష్ జవేరీ, ఓలా సహ వ్యవస్థాపకులు భవీష్ అగర్వాల్, మేక్ మై ట్రిప్ సీఈవో దీప్ కల్రా, గూగుల్ ఉపాధ్యక్షురాలు డయానా లేఫీల్డ్, కిర్లోస్కర్ సిస్టమ్స్ చైర్ పర్సన్ గీతాంజలి, టీవీఎస్ కేపిటల్ చైర్మన్ గోపాల్ శ్రీనివాసన్, టీహబ్ సీఈవో జయదీప్ కృష్ణన్, కాగ్నిజెంట్ సీవోవో రాజశ్రీ నటరాజన్, అపోలో ఆసుపత్రి జేఎండీ సంగీతా రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు.

 రామ్ చరణ్, సానియా మీర్జాలు కూడా

రామ్ చరణ్, సానియా మీర్జాలు కూడా

సినీ తారలు రామ్ చరణ్ తేజ, సోనమ్ కపూర్, అదితీరావు, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు సానియా మీర్జా, మిథాలీరాజ్ తదితరులు ప్రసంగించనున్నారు. కాగా, ఇప్పటి వరకు వాషింగ్టన్ డీసీ, ఇస్తాంబుల్, దుబాయి, మొరాకో, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జీఈఎస్ సదస్సులు జరిగాయి. హైదరాబాదులో ఎనిమిదో సదస్సు జరుగుతోంది.

English summary
Hyderabad City is gearing up for Global Entrepreneur Summit which is going to be held soon. Already, the government of Telangana is trying hard to change the city in order to impress the delegates freezing the event. The latest update is that Mega Power Star Ram Charan is going to be a part of the event and will be delivering a speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X