వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి సెలవులను తగ్గించిన తెలంగాణ విద్యా శాఖ: టీచర్ల అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంక్రాంతి సెలవులను తగ్గించింది తెలంగాణ విద్యాశాఖ. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సంక్రాంతి సెలవులను బుధవారం ప్రకటించింది ప్రభుత్వం.

జనవరి 11న రెండో శనివారం అయినప్పటికీ పాఠశాలలకు సెలవు ఉండదని విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11న పని దినంగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Sankranthi festival holidays reduced to five days in telangana.

ఆర్టీసీ కార్మికుల సమ్మె సమ్మయంలో దసరా సెలవులను పొడిగించిన నేపథ్యంలో సంక్రాంతి సెలవులను తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల రెండో శనివారం కూడా పనిచేయాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది ఇలావుంటే, విద్యాశాఖ ఉత్తర్వులపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మొదట జనవరి 11 నుంచి 16 వరకు ఆరు రోజుల సంక్రాంతి సెలవులు ప్రకటించారని.. దీంతో సొంత ఊర్లకు వెళ్లేందుకు తాము రిజర్వేషన్లు కూడా చేయించుకున్నామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఇప్పుడు హఠాత్తుగా సంక్రాంతి సెలవులను 12-16 వరకు అంటే ఐదు రోజులకు కుదించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. తాజా నిర్ణయంపై పునర్ సమీక్షించి.. మొదట ప్రకటించిన తేదీలను ఖరారు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

English summary
Sankranthi festival holidays reduced to five days in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X