• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అలెర్ట్: sankranti: ఊరెళ్లిపోయారా? -ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు: పోలీసుల హెచ్చరిక

|

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకొనే పెద్ద పండుగల్లో ప్రధానమైన సంక్రాంతి సందర్భంగా అంతటా సందడి నెలకొంది. వివిధ కారణాలతో నగరాల్లో నివసిస్తోన్న జనం తమ కుటుంబాలతో పండుగ చేసుకోడానికి పట్ణణాలు, పల్లెలకు చేరిపోయారు, ఇంకా చేరుతూనే ఉన్నారు. దారులన్నీ ఊళ్లకే అన్నట్లుగా హైదరాబాద్ నలువైపులా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులన్నీ మంగళ, బుధవారాల్లో కిటకిటలాడాయి. అయితే, పండుగ ప్రయాణాల సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రజలకు కీలక హెచ్చరికలు చేశారు.

బైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలోబైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలో

 సిటీలో వరుస దొంగతనాలు..

సిటీలో వరుస దొంగతనాలు..

హైదరాబాద్ సిటీలో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటోన్న నేపథ్యంలో ఎక్కడి కక్కడ టాస్క్ ఫోర్స్ బృందాలు దొంగల కోసం వేట సాగిస్తున్నాయి. పోలీసులు కల్పించే భద్రతకు తోడు ప్రజలు కూడా సాధ్యమైనంతలో అప్రమత్తంగా ఉండలని సీపీ హెచ్చరించారు. బుధవారం కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడియన ఆయన.. వరుస దొంగతనాలు జరుగుతోన్న తీరును, పట్టుబడిన దొంగల నేర చరిత్రను వివరించారు..

66 ఇళ్లకు కన్నమేసిన ఆటోడ్రైవర్

66 ఇళ్లకు కన్నమేసిన ఆటోడ్రైవర్

ఈస్ట్ జోన్ పరిధిలో వరుస ఇళ్ల దొంగతనాలు చేసిన షేక్‌ అబ్దుల్ జాఫర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ చెప్పారు. హైదరాబాద్‌లోని టౌలిచౌకీకి చెందిన ఇతడు ఆటో డ్రైవర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఆటో నడుపుతూనే దొంగతనాలు చేస్తున్నాడు. అతడి నుంచి 23 తులాల బంగారం, డైమండ్ హారంతో పాటు ఒక బైక్‌ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇతడిపై మొత్తం 66 ఇళ్ల దొంగతనాల కేసులున్నాయి.

 30 దొంగ కేసుల అజ్మత్..

30 దొంగ కేసుల అజ్మత్..

హైదరాబాద్‌లోనే కిషన్‌బాగ్‌కు చెందిన హాబీబ్ అజ్మత్ దక్షిణ జోన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడి సహాయకుడు షారూఖ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.10.50 లక్షల విలువైన 20 తులాల బంగారంతో పాటు ఆటోని సీజ్ చేశారు. ఇతడిపై ఇప్పటివరకు 30 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇద్దరి నుంచి మొత్తం రూ.22.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు, పండుగ ప్రయాణాల నేపథ్యంలో సీపీ ఇలా చెప్పారు..

ఊరికి పోతున్నట్లు పోస్టులు వద్దు..

ఊరికి పోతున్నట్లు పోస్టులు వద్దు..

సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారికి సిటీ కమిషనర్ అంజనీ కుమార్ జాగ్రత్తలతో కూడిన హెచ్చిరకలు చేశారు. ఊళ్లకు వెళ్తుతోన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించొద్దని.. నిత్యం అందరిపై కన్నేసి ఉంచే దొంగలకు లేదా అవకాశం దొరికిందికదాని చేతివాటం చూపేవాళ్లకు అలాంటి సమాచారం వరంగా మారుతుందని కమిషనర్‌ అన్నారు. ఊళ్లకు వెళ్తున్న వారు ముందుగా ఆయా ఏరియాల్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా దొంగతనాల్ని అరికట్టాలంటే ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. పోలీసులు ప్రవేశపెట్టిన సెక్యూరిటీ యాప్స్‌ ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

హైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారుహైకోర్టు అనుకూలం!: జగన్ ముహూర్తం -విశాఖకు రాజధాని తరలింపు -తేల్చేసిన సర్కారు సలహాదారు

సంక్రాంతి

English summary
With people from near and far heading to their native places to celebrate Sankranti this weekend, city police officials warned the public about chances of burglaries in their locked homes and called for extra care and precautions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X