వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ వర్షాలకు కూలిన సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలాషాపూర్ కోట..నాలుగు ఇళ్ళు ధ్వంసం

|
Google Oneindia TeluguNews

విపరీతంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి . జనగామ జిల్లాలో ఓ పురాతన కోట కుప్పకూలింది . 18వ శతాబ్దంలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ కోట కుప్ప కూలింది . సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గోడ శిధిలం అయ్యింది . కోట గోడ కూలటంతో అక్కడ పక్కనే ఉన్న నాలుగు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి .

విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎన్నడో నిర్మించిన పురాతన కోట గోడ కూలటంతో ఇళ్ళు ధ్వంసం కాగా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని ముందే గమనించిన ఇళ్ళ లోని వారు బయటకు పరుగులు తీయటం తో ప్రాణ నష్టం తప్పింది . ప్రాణ నష్టం జరగకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు . సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఈ కోటను అధికారులు పట్టించుకోకపోవటంతోనే ఈఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు.

 Sardar Sarvai Papannas fort collapsed due to heavy rains. Four houses were destroyed

దొరలు , భూస్వాముల వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుడు , నిరుపేదలకు అండగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఈ కోటను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా ప్రకటించి నాలుగు కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు . ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడు లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన నేపధ్యంలోనైనా అధికారులు కోట పూర్తిగా కూలిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

English summary
Khilashapur Fort collapsed in the Raghunathapally Zone due to heavy rains. The fort wall built by Sardar Sarvai Papanna is in ruins. The fort wall collapsed, destroying four adjoining houses. No casualties were reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X