వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం సీసాలతో బతుకమ్మ: సోషల్ మీడియాలో హల్ చల్: మండిపడుతున్న మహిళలు..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే కొందరు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్ సంప్రదాయాన్ని కించరపరిచేలా మద్యం బాటిళ్లతో బతుకమ్మ ఆడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం బాటిళ్లు పెట్టి సారా సారమ్మ అంటూ డీజే పెట్టి బాటిళ్ల చుట్టూ ఎగురుతూ డ్యాన్స్‌ చేశారని మహిళల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ సంప్రదాయాన్ని కించపరుస్తూ మద్యం బాటిళ్లతో డ్యాన్స్‌లు చేసిన సర్పంచ్‌, ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ సర్పంచ్ మాత్రం తాము ఎక్కడా కించపరిచేలా వ్యవహరించలేదంటూ..ఏం జరిగిందనేది వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మద్యం బాటిళ్లు పెట్టి..చుట్టూ డాన్స్ చేస్తూ..
యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మద్యం సీసాలతో గ్రామ సర్పంచ్‌, స్థానిక నాయకులు బతుకమ్మ ఆడిన సంఘటన పైన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

sarpanch and his followers played bahtukamma with liquor bottles became controversy

ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకల్లో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ రమేష్ తో పాటు మరి కొందరు మద్యం బాటిళ్లు పెట్టి సారా.. సారమ్మ అంటూ డీజే పెట్టి బాటిళ్ల చుట్టూ ఎగురుతూ డ్యాన్స్‌ చేశారని మహిళల నుంచి ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. దనీికి సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ రకంగా వ్యవహరించిన సర్పంచ్..ఇతర నేతల పైన చర్యలు తీసుకోవాలని మహిలలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఇది వైరల్ గా మారుతోంది.

అవి బతుకమ్మ సంబురాలు కావంటూ..
ఈ ఘటన వివాదాస్పదం కావటం..మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో సర్పంచ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. సర్పంచ్ తో సహా అందులో పాల్గొన్న వారిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మీద ఆయన స్పందించారు. అయితే..సర్పంచ్ మాత్రం అవి బతుకమ్మ సంబురాలు కావని, బర్త్‌డే వేడుకల్లో విందు చేసుకున్నామని సర్పంచ్‌ రమేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో గిట్టని వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారన్నారు.

రాత్రి తొమ్మిది గంటలలోపే బతుకమ్మ సంబురాలు ముగియగా, రాత్రి 12 తర్వాత పుట్టినరోజు వేడుకలు జరిగాయని చెప్పుకొచ్చారు. కానీ, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో దీని పైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీడియో వారు మద్యం బాటిళ్ల చుట్టూ తిరుగుతూ డాన్స్ చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని మహిళలు వాదిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.

English summary
One sarpanch and otehrs insulted Bathukkam in Yadadri dist. They played bathkamma with liquor bottles. They round around bottles and used dj for dance. Now this issue became viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X