వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఉత్తమ్ కుమ్మక్కు, భయపడి కౌగిలించుకునే రకం'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ కుంతియాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం నిప్పులు చెరిగారు. వారిద్దరు తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికార తెరాసతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

<strong>దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్</strong>దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్

తన సతీమణిని గెలిపించుకోలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. టిక్కెట్ల పంపకంలో జాప్యం జరిగిందని, డబ్బులు ఇచ్చి టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆదివారం పార్టీ సమీక్షా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెబుతూ సర్వేను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

టిక్కెట్లు అమ్ముకున్నారు

టిక్కెట్లు అమ్ముకున్నారు

దీనిపై సర్వే సోమవారం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్నారు. టిక్కెట్లు అమ్ముకొని, ఓటమికి కారకులైన వారే ఇప్పుడు గాంధీ భవన్లో సమీక్షలు చేస్తున్నారన్నారు. దీనిని తాను ప్రశ్నించానని, అందుకే సస్పెండ్ చేశారన్నారు. ఎన్నికల కోసం పార్టీ అధిష్టానం పంపించిన నిధులు ఏమయ్యాయో చెప్పాలన్నారు.

కావాలనే నన్ను ఓడించారు

కావాలనే నన్ను ఓడించారు

అసెంబ్లీ ఎన్నికల్లో తననను కావాలనే ఓడించారని సర్వే అన్నారు. తనతో పాటు మల్లుభట్టి విక్రమార్కను ఓడించే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. అధిష్ఠానం డబ్బులు పంపినా టికెట్లు అమ్ముకున్నారన్నారు. గెలిచిన తర్వాత కూడా అధికార తెరాస 24 గంటలు పని చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పెంచి పోషించిన వాళ్లు తనపై దాడికి ప్రయత్నాలు చేశారని సర్వే అన్నారు. సంబంధం లేని వాళ్లను సమీక్షలో ఎందుకు కూర్చోబెట్టారన్నారు.

ఈ పైలట్ తుపాకికి భయపడి కౌగిలించుకునే రకం

ఈ పైలట్ తుపాకికి భయపడి కౌగిలించుకునే రకం

ఉత్తమ్‌, కుంతియా పార్టీ నుంచి తప్పుకునే వరకు ఆందోళన చేస్తానన్నారు. వీళ్ల మొహం చూసే ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. కేంద్రంలో రాహుల్‌ ప్రధాని కావాలని, ఇక్కడ కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటే పార్టీని ముంచేశారన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ అయితే దేశం కోసం పనిచేస్తారని, ఈ పైలట్‌ మాత్రం తుపాకీకి భయపడి కౌగిలించుకునే రకమని ఉత్తమ్ పైన నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని తాను ఢిల్లీలో రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.

English summary
Congress Party senior leader and former union minister Sarve Satyanarayana on Monday lashed out at TPCC chief Uttam Kumar Reddy and RC Kuntia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X