వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర సృష్టించిన ఇస్రో: శాటిలైట్ తయారీలో హైదరాబాద్ పాత్ర

శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ37 వాహన నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది. 104 ఉపగ్రహాలను ఇది తీసుకు వెళ్లింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ37 వాహన నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది. 104 ఉపగ్రహాలను ఇది తీసుకు వెళ్లింది. దీంతో షార్ చరిత్ర సృష్టించింది. అయితే, ఇందులో హైదరాబాద్ పాత్ర కూడా ఉంది.

భాగ్యనగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు రక్షణ రంగానికి సంబంధించిన విడి భాగాల తయారీలోనూ పేరొందారు. తాజాగా గగనానికి చేరనున్న మరో ప్రతిష్ఠాత్మక ఉపగ్రహ వాహక నౌకకు కొన్ని విడి భాగాలను ప్రశాంత్‌నగర్‌లోని నాగసాయి ప్రెసెషియన్‌ ఇంజినీర్స్‌ ప్రయివేట్ లిమిటెడ్‌ అందించింది.

చరిత్ర సృష్టించిన ఇస్రో: 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ-సీ37చరిత్ర సృష్టించిన ఇస్రో: 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ-సీ37

Satellite parts made in Hyderabad

దీని నిర్వాహకులు బీఎన్ రెడ్డి పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, విమానాల తయారీలో సేవలందించారు. ఈ సంస్థలో తయారయ్యే విడి భాగాలు అన్ని కూడా రక్షణ రంగానికి సంబంధించినవే కావడం గమనార్హం.

బుధవారం నాడు అంతరిక్షంలోకి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ37 వాహకనౌకలో వాడిన కొన్ని విడి భాగాలు బీఎన్ రెడ్డి రూపొందించినవి. ఇందులో కొన్నిటిని యుద్ధప్రాతిపదికన తయారుచేసి పంపించారు. రాబోయే రెండేళ్ల వరకు తమకు ఇటువంటి ఆర్డర్లు ఉన్నాయన్నారు.

ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ఎగిసిన నలభైకి పైగా ఉపగ్రహాలలో ముప్ఫై రెండిటికి విడి భాగాలు తయారు చేశారు. విమానాల తయారీలోనూ హెచ్‌ఏఎల్‌కు సేవలు అందిస్తున్నారు. ఎయిర్ బస్‌ తలుపులో వాడే ఇరవై అయిదు రకాల భాగాలు ఇక్కడ తయారవుతున్నాయి.

English summary
India's space agency ISRO launched a record 104 satellites on a single rocket from the Sriharikota spaceport in Andhra Pradesh today. India has become the first country to successfully carry so many satellites in a single mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X