వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుత్వంపై దాడి, తిరుపతినీ వదల్లేదు, రామాలయం కోసం..: పరిపూర్ణానంద

అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరగా జరగాలని కాంక్షిస్తూ ఈ రోజు (గురువారం) నుంచి అయోధ్యలో శతకోటి రామనామ జప మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద బుధవారం తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరగా జరగాలని కాంక్షిస్తూ ఈ రోజు (గురువారం) నుంచి అయోధ్యలో శతకోటి రామనామ జప మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు శ్రీపీఠం స్వామి పరిపూర్ణానంద బుధవారం తెలిపారు.

గట్టిగా అడిగితే బెంగళూరు వెళ్లి దాక్కున్నాడు: కంచ ఐలయ్యపై పరిపూర్ణానంద స్వామిగట్టిగా అడిగితే బెంగళూరు వెళ్లి దాక్కున్నాడు: కంచ ఐలయ్యపై పరిపూర్ణానంద స్వామి

ఎన్నారైల ఆధ్వర్యంలో 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మహాయజ్ఞం చేపడుతున్నట్లు చెప్పారు. రామాలయం అనేది ఒక గుడి కాదని అది హిందువుల చరిత్ర, భారతీయ సంస్కృతి, కోట్లాది మంది విశ్వాసమన్నారు.

 హనుమంతుడి దీపారాదన

హనుమంతుడి దీపారాదన

మహాయజ్ఞం సమయంలో తెలుగు ప్రజలు వారి ఇళ్లలో హనుమంతుడి దీపారాధన చేయాలని పరిపూర్ణానంద సూచించారు. రామాలయం విషయాన్ని బయట పరిష్కరించుకోవాలని కోర్టులు సూచించాయని, కానీ చట్ట ప్రకారం తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.

 యజ్ఞంతో బీజేపీకి సంబంధం లేదు

యజ్ఞంతో బీజేపీకి సంబంధం లేదు

తాము చేస్తున్న మహా యజ్ఞానికి బిజెపికి ఎలాంటి సంబంధం లేదని పరిపూర్ణానంద చెప్పారు. అయోధ్యలో రామ మందిరం త్వరలో నిర్మించాలనేది తమ ఉద్దేశ్యమన్నారు. నాలుగు వేదాల హవనం ఉంటుందని, హనుమాన్ పూజలు, చండీయాగం, సుదర్శన యజ్ఞం ఉంటాయన్నారు.

 హిందూధర్మ ప్రతిష్టాపనే నా లక్ష్యం

హిందూధర్మ ప్రతిష్టాపనే నా లక్ష్యం

భారతదేశంలోని సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్వామి తెలిపారు. వివిధ పీఠాధిపతుల ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశ్వప్రసాద శర్మ నేతృత్వంలోని ప్రవాస భారతీయులు సహకారం అందిస్తున్నాన్నారు. హిందూ ధర్మ ప్రతిష్టాపనే తన లక్ష్యమని, అందుకే కాషాయం తీసుకున్నానని పరిపూర్ణానంద స్పష్టం చేశారు.

 పలు కారణాల వల్ల రామాలయం నిర్మాణం వాయిదా

పలు కారణాల వల్ల రామాలయం నిర్మాణం వాయిదా

వివిధ కారణాల వల్ల రామమందిర నిర్మాణం వాయిదా పడుతూ వస్తోందని పరిపూర్ణానంద అన్నారు. కోర్టు వెలుపల చర్చల ద్వారా రామమందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీం చేసిన సూచన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు తీర్పుకు లోబడే రామమందిర నిర్మాణం జరగాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే మళ్లీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశామన్నారు.

రామాలయంపై బాబ్రీ పురాతత్వ శాఖ తవ్వకాల్లో ఆధారాలు

రామాలయంపై బాబ్రీ పురాతత్వ శాఖ తవ్వకాల్లో ఆధారాలు

అయోధ్య రామాలయం పైనే బాబ్రీ మసీదు నిర్మించారనేందుకు పురాతత్వ శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయని పరిపూర్ణానంద తెలిపారు. రామాలయ నిర్మాణానికి ప్రస్తుతం నిర్వహించే మహాయజ్ఞం బలాన్ని సమకూరుస్తుందన్నారు.

అదే సమయంలో పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద రచయిత

అదే సమయంలో పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద రచయిత

కంచ ఐలయ్య పుస్తకాలపై స్పందించారు. కులాలు, మతాలపై పుస్తకాలు రాస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా హిందూ ధర్మంపై వివక్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూమతంపై ఇతర మతాలు దాడులు చేస్తున్నాయని, చివరకు తిరుమలను కూడా క్రైస్తవ మత ప్రచార కేంద్రంగా మార్చుకోవాలని ప్రయత్నాలు జరిగాయన్నారు.

English summary
Sathakoti Ramanama Japa Mahayagnam in Ayodhya from Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X