వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా చేదు: గ్రీన్ కార్డ్ ఇచ్చేసి, భార్య కోసం మైక్రోసాఫ్ట్ వదిలేద్దామనుకున్న సత్య నాదెళ్ల!

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినంగా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా గతంలో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.

|
Google Oneindia TeluguNews

ఓర్లాండో: అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినంగా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా గతంలో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.

తన భార్య కోసం అతను గ్రీన్ కార్డును కాదనుకొని, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వద్దనుకొని వచ్చేద్దామనుకున్నారట. కానీ ఆ తర్వాత హెచ్1బి వీసాకు దరఖాస్తు చేసుకున్నారు.

సత్య నాదెళ్లకు ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు

సత్య నాదెళ్లకు ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు

సత్య నాదెళ్ల 'హిట్ రిఫ్రెష్' అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు రాశారు. తొలినాళ్లలో అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ సమయంలో అమెరికాలో ఉద్యోగం మానేసి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైపోయారట కూడా.

సత్య నాదెళ్ల భార్య వీసా నిరాకరణ

సత్య నాదెళ్ల భార్య వీసా నిరాకరణ

1993లో అను అనే యువతితో సత్య నాదెళ్లకు పెళ్లయింది. అప్పుడు తన భార్యతో కలిసి అమెరికా సీటెల్‌ నగరానికి వెళ్లేందుకు తాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని, కానీ అమెరికా కాన్సులేట్‌ అధికారులు తన భార్య వీసా నిరాకరించారని పేర్కొన్నారు.

భార్య కంటే ఏదీ ఎక్కువ కాదని, భారత్‌లో ఉండిపోదామనుకున్నా

భార్య కంటే ఏదీ ఎక్కువ కాదని, భారత్‌లో ఉండిపోదామనుకున్నా

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ చట్టాల ప్రకారం గ్రీన్‌కార్డుదారుడు ఇతర దేశంలో వివాహం చేసుకుంటే వారి జీవిత భాగస్వామి వీసా నిరాకరిస్తారని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దీంతో తాను గ్రీన్‌కార్డు తిరిగిచ్చేసి భారత్‌లోనే ఉండిపోదామనుకున్నానని, ఆ సమయంలో తన భార్య కంటే జీవితంలో ఏదీ ఎక్కువ కాదనిపించిందని చెప్పారు.

గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తే ఆశ్చర్యపోయారు

గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తే ఆశ్చర్యపోయారు

హెచ్1బీ వీసాతో పనిచేసే వారి జీవిత భాగస్వామి అమెరికాకు వెళ్లేందుకు అవకాశముందని, దీంతో తాను 1994లో ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లానని, గ్రీన్‌కార్డు ఇచ్చేసి, హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అక్కడి వారు తనను చూసి ఆశ్చర్యపోయారన్నారు.

మాతృదేశం నుంచి ఎంతో నేర్చుకున్నా

మాతృదేశం నుంచి ఎంతో నేర్చుకున్నా

ఆ తర్వాత భార్యతో కలిసి సీటెల్ నగరానికి వచ్చానని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో తన సహోద్యోగుల్లో ఒకరైన కునాల్‌ బహల్‌కు హెచ్1బీ వీసా గడువు ముగిసిందని, దీనికి తోడు గ్రీన్‌కార్డ్‌ రాకపోవడంతో ఆయన భారత్‌కు వచ్చేసి స్నాప్‌డీల్‌‌ను ప్రారంభించారని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌లో తన ఎదుగుదలకు స్నాప్‌డీల్‌ లాంటి సంస్థల ప్రభావం చాలా ఉందని, నన్ను నేను మార్చుకోవడంలో తన మాతృదేశం నుంచి నేను ఎంతో నేర్చుకున్నానని పుస్తకంలో పేర్కొన్నారు.

English summary
With his permanent residency coming in the way of his newly wed wife joining him in the US, Satya Nadella surrendered his Green Card and applied for a H1-B visa, a move which gave him instant notoriety around the Microsoft Campus in Redmond, the Indian-born CEO has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X