హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ చేరుకున్న సత్యనాదెళ్ల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్(81) అనారోగ్యంతో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం యుగంధర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ల లండన్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుక్కాపురం నాదెళ్ల(బీఎన్) యుగంధర్ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. 1962 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన యుగంధర్.. ఆంధ్రప్రదేశ్ తోపాటు కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు.

పేదల పెన్నిధి..తనయుడికి స్ఫూర్తిప్రదాత యుగంధర్ కన్నుమూతపేదల పెన్నిధి..తనయుడికి స్ఫూర్తిప్రదాత యుగంధర్ కన్నుమూత

satya nadella reaches hyderabad

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయ, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగంలో సేవలు అందించారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో 2004-2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు.

1988-1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమికి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఐఏఎస్‌గా సేవలందించిన యుగంధర్.. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, తన తండ్రి కమ్యూనిస్టు కాదని, కానీ కొన్ని కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయని గతంలో సత్య నాదెళ్ల చెప్పారు.

English summary
Microsoft CEO Satya Nadella on Sunday reached hyderabad to attend funeral of his father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X