వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మిషన్ భగీరథపై సాహూ ప్రశంసలు: పోలవరానికి బూర కొలికి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పాన్ని చూసి గర్వపడుతున్నామని కేంద్ర తాగునీటి కార్యదర్శి సత్యభ్రత సాహు అన్నారు. తాగునీటిపై సాహు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ర్టాల ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాహు - మిషన్ భగీరథపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ అద్భుత పథకమని ఆయన అన్నారు. మిషన్ భగీరథపై దేశమంతా చర్చ జరుగుతోందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ సంకల్పాన్ని చూసి గర్వపడుతున్నామని, మిగతా రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా మిషన్ భగీరథ లక్ష్యం గొప్పదని నీతి అయోగ్ సలహాదారు అశోక్‌జైన్ అన్నారు.

Satyabrata Sahu praises Telangana govt's mission Bageeratha

ఇదిలావుటే, పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ కొలికి పెట్టారు. పోలవరం డిజైన్‌ను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారంనాడు ఆయన లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం కాదని తెలిపారు.

డిజైన్‌ను మాత్రమే మార్చాలని కోరుతున్నామన్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రాష్ర్టానికి నిధులు పెంచాలని కోరారు. గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తే లెఫ్ట్ టెర్రరిజంను అరికట్టవచ్చన్నారు. గ్రామీణ మహిళలు, పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

English summary
Union drinking water secretary Satyabrata Sahu praised Telangana CM K Chandrasekhar rao's pet project Mission Bhageeratha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X