వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీతక్కకు సత్యవతి ఆఫర్ ... టీఆర్ఎస్ లోకి రా .. కలిసి పనిచేద్దామన్న మంత్రి

|
Google Oneindia TeluguNews

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి సత్యవతి రాథోడ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ లోకి రా కలిసి పని చేద్దాం అంటూ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమెను ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవితలు సీతక్కను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

నాడు బాబు బినామీ నేడు సచ్చీలుడా... టీటీడీలో స్థానమా... జగన్ పై జనసేన ఫైర్నాడు బాబు బినామీ నేడు సచ్చీలుడా... టీటీడీలో స్థానమా... జగన్ పై జనసేన ఫైర్

 బతుకమ్మ చీరల పంపిణీలో సీతక్కపై ఆసక్తికర వ్యాఖ్యలు

బతుకమ్మ చీరల పంపిణీలో సీతక్కపై ఆసక్తికర వ్యాఖ్యలు

ములుగు లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హోదాలో హాజరైన సత్యవతి రాథోడ్ బతుకమ్మ తొలి చీరలను గిరిజన ఆరాధ్య దేవతలైన సమ్మక్క-సారలమ్మల సమర్పించి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే సీతక్క ముగ్గురు ఒకే వేదిక మీద చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముగ్గురు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

పాత దోస్తులు సత్యవతి , మాలోతు కవితలను కలుసుకోవటం సంతోషంగా ఉందన్న సీతక్క చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గా ముందు మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క 2009లో తాము ముగ్గురం ఒకేసారి ఎమ్మెల్యేలయ్యామని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని సీతక్క పేర్కొన్నారు. గతంలో సత్యవతి రాథోడ్, సీతక్క ఇరువురు టీడీపీలో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. పార్టీలు వేరైనా ఒకే వేదిక మీద కలుసుకున్న ఈ ముగ్గురు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

సీతక్కా ... టిఆర్ఎస్ లోకి రా అంటూ ఆహ్వానించిన , మంత్రి , ఎంపీ

సీతక్కా ... టిఆర్ఎస్ లోకి రా అంటూ ఆహ్వానించిన , మంత్రి , ఎంపీ


ఇక సీతక్క చేసిన వ్యాఖ్యలకు ఎంపీ మాలోతు కవిత స్పందిస్తూ సీతక్కా ... టిఆర్ఎస్ లోకి రా అందరం ఒకే పార్టీలో ఉంటామని ఆమెతో అన్నారు. వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ సైతం నువ్వు ఒక్కదానివే అటెందుకు .. పార్టీలోకి రా కలిసి పని చేద్దామని, కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి అయినా టిఆర్ఎస్ పార్టీలో చేరాలని సీతక్క ను కోరారు. సీతక్క తన పాత మిత్రురాలు సత్యవతి రాథోడ్ చూపించిన ఆప్యాయతకు, ఎంపీ మాలోతు కవిత అభిమానానికి సంతోషం వ్యక్తం చేశారు.

మహిళా మంత్రి వ్యాఖలతో ములుగులో ఆసక్తికర చర్చ

మహిళా మంత్రి వ్యాఖలతో ములుగులో ఆసక్తికర చర్చ

రాజకీయాలను పక్కన పెడితే ముగ్గురు మహిళా నేతలు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ చీరలను అందజేశారు. సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత లు టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో సీతక్క పార్టీ మారతారా అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి వర్గంగా కాంగ్రెస్ పార్టీ లోకి ప్రవేశించిన సీతక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 సదరు మహిళా నేతల సూచనపై సీతక్క ఆలోచిస్తారా ?

సదరు మహిళా నేతల సూచనపై సీతక్క ఆలోచిస్తారా ?

గతంలోను ఎ��లాలని ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం �%0��ీతక్క టీఆర్ఎస్ లోకి వెళ్లాలని ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని సీతక్క పార్టీ మారే ప్రసక్తి లేదని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ మారేది లేదు అన్నట్టుగానే పని చేత్శుంది. స్థానికంగా ఉన్న గులాబీ పార్టీ నేతల వల్ల పలుమార్లు అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఆమె పార్టీ మార్పుకు సుముఖత వ్యక్తం చెయ్యలేదు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు టిడిపిలో కీలకంగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వంటి నాయకులు నేడు మంత్రులుగా కొనసాగుతున్న సమయంలో సీతక్క ను ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న సదరు మహిళా నేతల సూచనపై సీతక్క భవిష్యత్తులో ఆలోచిస్తారేమో వేచి చూడాలి.

English summary
Minister Sathyavathi Rathod bumper offer to Muluu MLA Sitakka. She was warmly welcomed into the party at the Batukamma sarrees distribution event . She offered to work together into the TRS party. The remarks made by Minister Satyavati Rathod and MP Malothu kavitha to Sitakka are now a subject of intense debate in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X