వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచార జోష్: చిందేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

చిందేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్

మహబూబాబాద్: మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది.
మరిపెడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎన్నికల ఇంఛార్జి ఎడవెల్లి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ శారద, అభ్యర్థులు సింధూర, లలిత, స్రవంతి, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.

తెలంగాణలో అద్భుతమైన పాలన..

తెలంగాణలో అద్భుతమైన పాలన..

ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఈ నియోజవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ కష్టపడి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మున్సిపాలిటీ సాధించారు. కేటీఆర్ దగ్గర నుంచి అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. తెలంగాణ కావాలని కొట్లాడి సాధించుకున్న ఉద్యమ నాయకుడు తరవాత సీఎంగా కేసిఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని మంత్రి చెప్పారు. ‘కేటీఆర్ నాయకత్వంలో 120 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 500 మున్సిపాలిటిల వార్డులలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకక దిక్కూ దివాణం లేకుండా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజక వర్గంలో స్వయంగా ఆయన భార్య 40వేల ఓట్లతో ఓడిపోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది' అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలి..

కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలి..

‘సీఎం కేసిఆర్ కృషి వల్ల నేడు రైతులకు 24 గంటల కరెంట్, కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు నీరు, రైతు బంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, వృద్దులకు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తూ సంక్షేమ రాజ్యం నడిపిస్తున్నారు. ఈ నియోజక వర్గంలో ఎవరూ లేనట్టు గత ఎన్నికల్లో ఒక డాక్టర్‌ని తీసుకొస్తే...ఇపుడు అడ్రస్ లేడు. మళ్లీ ఇప్పుడూ మేమున్నామంటూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారు.

పండగ వేస్తే ఇళ్ళు అలికినట్లు ఎన్నికలు వస్తే గాని కనిపించని కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో మరింత గట్టిగా బుద్ది చెప్పాలి' అని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.

ఒక బంగ్లాగా ఉన్న మరిపెడ ఇప్పుడు..

ఒక బంగ్లాగా ఉన్న మరిపెడ ఇప్పుడు..

‘24 గంటలు మీకు అందుబాటులో ఉండి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే రెడ్యా నాయక్ నాయకత్వంలో ఇప్పటికే రెండు వార్డు లు బోణీ కొట్టాము.. మిగిలిన 13 వార్డుల్లో కూడా తిరుగులేని మెజారిటీతో గెలవాలి. వచ్చిన అభివృద్ధి మీ అనుభవంలో ఉంది. మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఒక బంగ్లాగా ఉన్న మరిపెడ నేడు ఎమ్మెల్యే రెడ్యా నాయక్ నాయకత్వంలో దినదిన అభివృద్ధి చెందుతుంది' అని మంత్రి వ్యాఖ్యానించారు.

చిందేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ, ఎమ్మెల్యే...

‘వార్డు నుంచి సీఎం వరకు టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ఉన్నందున వేరే పార్టీలు వచ్చి చేసేదేమీ ఉండదు కాబట్టి అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో టీఆర్ఎస్ నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తాం' అని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రచారం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ స్థానికులతో కలిసి డ్యాన్సులు చేసి ఉత్సాహపర్చారు.

English summary
Telangana minister Satyawati Rathod, MP Maloth Kavitha, MLA Redya Naik dances in election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X