వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయానికి గుడ్ బై చెప్పండి.. చక్కని ప్రణాళికతో పదవతరగతి పరీక్షలు రాయండి

|
Google Oneindia TeluguNews

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంటుంది. అయితే ఈ భయానికి ముందుగా విద్యార్థులు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు, విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, క్రమశిక్షణతో పరీక్షలు రాసి రావాలని మాత్రమే విద్యార్థులకు చెప్పాలి. విద్యార్థుల పరీక్షల పట్ల తమలో ఉన్న టెన్షన్ ఏమాత్రం విద్యార్థుల ముందు బయట పెట్టకూడదు.

<strong>పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం ... ఒక నిముషం నిబంధన సడలింపు</strong>పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం ... ఒక నిముషం నిబంధన సడలింపు

 పరీక్షలు రాసే విద్యార్థులను భయానికి , ఒత్తిడికి దూరంగా ఉంచండి

పరీక్షలు రాసే విద్యార్థులను భయానికి , ఒత్తిడికి దూరంగా ఉంచండి

ఒకవేళ విద్యార్థులు భయానికి గురైతే పరీక్ష రాసేటప్పుడు చదివినదంతా మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ భయం కారణంగా విద్యార్థులు గందరగోళంతో కూడిన జవాబులు రాసే అవకాశాలే అధికం. కాబట్టి భయానికి చెక్ పెట్టాలంటే ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు కావాల్సిన ధైర్యాన్ని నూరిపోయాలి. వారి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. విద్యార్థులు ఒత్తిడికి గురైతే దాని ప్రభావం వారి ఆరోగ్యంపైనా కనిపిస్తుంది. పరీక్షల సమయంలో జ్వరం ,వాంతులు వంటి అనారోగ్యం కలిగితే విద్యార్థులు పరీక్షల్లో బాగా రాయలేకపోతారు. కాబట్టి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను ఒత్తిడికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది.

 ప్రణాళిక లేకుండా చదవటం , నిద్రపోకుండా చదవటం చెయ్యకూడదు

ప్రణాళిక లేకుండా చదవటం , నిద్రపోకుండా చదవటం చెయ్యకూడదు

అటు విద్యార్థులు సైతం తమకు తాము ధైర్యం చెప్పుకొని పరీక్షలు బాగా రాస్తామనే నమ్మకంతో ప్రిపేర్ అవ్వాలి. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి రోజూ పది నిమిషాలు ధ్యానం చేయడం మంచిది.
కొందరు విద్యార్థులు రాత్రింబవళ్లు నిద్రపోకుండా చదువుతారు. గంటల తరబడి చదవడం, ప్రణాళిక లేకపోవడం వంటివి తీరా పరీక్ష రాసే సమయంలో విద్యార్థుల జ్ఞాపకశక్తికి పరీక్ష పెడతాయి. సరైన విశ్రాంతి లేకపోతే చదివినవి కూడా మర్చి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. అలాగే ప్రతి గంటకూ కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎలా చదివామన్నదే ముఖ్యం. పరీక్షల సమయంలో మేడపై చదవడం, ప్రెండ్స్ దగ్గరికి నోట్స్‌కని, బుక్స్‌కని వెళ్ళి ఎండలో తిరగడం చేయకూడదు. కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయరాదు. కేవలం ఇప్పుడు రివిజన్ మాత్రమే చేయాలి.

సమయపాలన అవసరం

సమయపాలన అవసరం

ఇది వరకు చదవని ప్రశ్నలు నేర్చుకునే ప్రయత్నం చేయవద్దు. సెల్‌ఫోన్ వాడటం మానేయాలి. ప్రెండ్స్‌తో చర్చ వద్దు. పరీక్షల గురించి, నేర్చుకున్న ప్రశ్నల గురించి మాట్లాడవద్దు. ప్రతి రోజు ఒక పద్దతి ప్రకారం చదవటం, చదువు మీద ఇష్టాన్ని పెంపొందించుకోవటం, చదివే పాఠాలన్ని ఇష్ట పడటం చేస్తే తప్పక ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడు చదివిన సబ్జెక్టు తప్పక గుర్తుంటుంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయాన్ని బట్టి సన్నద్దమవ్వాలి.ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలి. ఎలా ఎదుర్కొవాలి, ఎలా రాయాలి, మార్కులు ఉలా సంపాదించాలనే అంశాలపై దృష్టి సారించాలి. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్యశాస్త్రం, ఇలా అన్ని సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక టైం టేబుల్ అంటూ లేకుండా సమయాన్ని చక్కగా వినియోగించుకోవటం ఏ విద్యార్థికి అయినా కష్టమైన పనే.

తల్లిదండ్రులు పిల్లలకు పోష్టికాహారం ఇవ్వటం మర్చిపోవద్దు

తల్లిదండ్రులు పిల్లలకు పోష్టికాహారం ఇవ్వటం మర్చిపోవద్దు

ముందుగా ఎన్నింటికి లేవాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. రాత్రి 10 గంటల కల్లా నిద్ర పోయి, తెల్లవారు జామున చదువుకోవటం ఉత్తమం. రోజంతా తాజాగా ఉండాలంటే రాత్రి వేళ గాఢ నిద్ర అత్యంత అవసరం. ఆహారంలో ఆయిల్ ఫుడ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అలసిపోయే అవకాశం ఉండదు.

పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు సరైన ఆహారం తీసుకోరు. కొంత మంది అసలు ఆహారమే తీసుకోరు. ఇది ప్రమాదకరం. తల్లిదండ్రులు విద్యార్థుల ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. రోజూ కొబ్బరిబోండాం నీరు తాగించడం మంచిది. కాఫీ, టీలు తగ్గించి మజ్జిగ, పళ్ళరసాలు, బలమైన ఆహారం ఇవ్వాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు కూడా ఆరోగ్యంగా పనిచేస్తుంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, ప్రణాళికా బద్ధమైన రివిజన్ విద్యార్థులు చేసేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.

సమాధానాలు రాసేప్పుడు జాగ్రత్తగా నీట్ గా రాయాలి .. అవసరమైన పెన్నులు, పెన్సిళ్ళు మర్చిపోకండి

సమాధానాలు రాసేప్పుడు జాగ్రత్తగా నీట్ గా రాయాలి .. అవసరమైన పెన్నులు, పెన్సిళ్ళు మర్చిపోకండి

ఇక పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రాలను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. సమాధానాలు రాసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్షరాలను గుండ్రంగా రాయాలి. అక్షర దోషాలు ఉండకూడదు. ఎక్కడా కొట్టి వేతలు, దిద్దు బాట్లు ఉండకూడదు. ఒక క్రమ పద్దతిలో సమాధానాలు రాయాలి.సమాధాన పత్రాలు కరెక్షన్ చేసే అధ్యాపకులకి ఏ ప్రశ్నకి ఏ సమాధానం రాశారో అర్ధమయ్యేలా నీటుగా పొందుపర్చాలి. పెన్నులతో పాటు, స్కెచ్ పెన్నులు ఉపయోగించడం ద్వారా సమాధాన పత్రాలు ఆకర్షణీయంగా కనబడుతాయి.

అరగంట ముందే పరీక్షా కేంద్రం వద్ద ఉంటే మంచిది

అరగంట ముందే పరీక్షా కేంద్రం వద్ద ఉంటే మంచిది

ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల రోజుల్లో అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. తెలంగాణా రాష్ట్రంలో గతంలో ఉన్న ఒక్క నిముషం నిబంధన సడలించి 5 నిముషాల వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి లేట్ కాకుండా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్ళటం మంచిది . పరీక్ష హాల్‌కు దూరంగా ఉన్న వారు గంట ముందుగా బయలుదేరడం శ్రేయస్కరం.పరీక్షా కేంద్రానికి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించటం తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఇన్విజిలేటర్‌తో తప్ప పరీక్ష హాల్‌లో విద్యార్థులు ఎవరితోనూ మాట్లాడవద్దు. ఒకటికి రెండు సార్లు హాల్‌టిక్కెట్ నెంబర్ సరిచూసుకోవాలి. తలపక్కకి తిప్పకుండా సమాధానాలు రాయడం మంచిది. ఎవరెన్ని అడిషనల్ షీట్లు రాస్తున్నారు అని గమనించి ఆందోళన చెందవద్దు. వీలైనంత వరకు ఏ ప్రశ్నలు బాగా రాయగలరో వాటినే ముందుగా రాయడానికి ప్రయత్నించాలి. దిద్దుబాటులు లేకుండా టైం అయ్యే వరకు పరీక్ష హాల్ నుంచి బయటకి రాకపోవడం మంచిది.

English summary
Board exams play an important role in the life of students and parents as well. Board exams are essential because the grades which students secure decide the future prospects of the student. There is a lot of pressure on students who are going to appear in the board exams. They go through mental stress, tension, and anxiety which ultimately result in restlessness and depression in various students. Positive thinking is really required to deal with examination stress.Have a Healthy Diet and Good Sleep. parents also need to take care and also give confidence to the children who are appearing to the SSC exams .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X