• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అర్నబ్ గోస్వామి కేసులో ట్విస్ట్.. సుప్రీం ఊరట.. రేవంత్ రెడ్డి ఎంట్రీ.. కేసీఆర్ సర్కారుకూ నోటీసులు..

|

వివాదాస్పద జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి సంబంధించిన కేసుల్లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. పాల్ఘర్ మూకదాడి ఘటనపై మతవిద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ లపైనా అనూహ్య ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, అర్నబ్ పై చర్యలకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ప్రివిలేజ్ నోటీసులు పంపారు. వివరాల్లోకి వెళితే..

ఆగమేఘాల మీద విచారణ..

ఆగమేఘాల మీద విచారణ..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కేవలం వీడియో కాన్ఫరెన్సుల ద్వారా.. అంది కూడా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తోన్న సుప్రీంకోర్టు.. జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి పిటిషన్ ను ఎమర్జెన్సీగా విచారించడం గమనార్హం. పాల్ఘర్ మూకదాడి ఘటనపై నిజాయితీగా రిపోర్టు చేస్తున్న తనపై కొందరు కావాలని కక్ష పెంచుకున్నారని, దేశవ్యాప్తంగా వందలకొద్దీ కేసులు పెట్టారని, జర్నలిస్టుగా తనకుండే స్వేచ్ఛను కాపాడాలంటూ అర్నబ్ గురువారం రాత్రి పిటిషన్ వేయగా, శుక్రవారం ఉదయమే దానిపై విచారణ చేపట్టారు. అర్నబ్ తరఫున మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

3 వారాల రక్షణ..

3 వారాల రక్షణ..

పాల్ఘర్ ఘటనపై మతవిద్వేషాలు రెచ్చగొట్టడంతోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ అర్నబ్ గోస్వామిపై పలు రాష్ట్రాల్లో 150కిపైగా కేసులు నమోదయ్యాయి. కాగా, సదరు ఎఫ్ఐఆర్ లపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. నాగ్ పూర్ లో దాఖలైన కేసును మాత్రం ముంబైకి బదిలిచేసింది. అంతేకాదు, అర్నబ్ కు మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఊరట దక్కడం పత్రికా స్వేచ్ఛకు దక్కిన విజయంగా అర్నబ్ అభివర్ణించారు.

సోనియాపై మళ్లీ విమర్శలు..

సోనియాపై మళ్లీ విమర్శలు..

పాల్ఘర్ ఘటనపై తన రిపబ్లిక్ టీవీలో చర్చ సందర్భంగా అర్నబ్.. సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో గురువారం రాత్రి ఆయన కారుపై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు యువనేతలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రిపబ్లిక్ టీవీలో చెప్పినట్లు పాల్ఘర్ ఘటనలో సాధువుల్ని కొట్టి చంపింది ముస్లింలు కారని, అరెస్టయిన 110 మందీ హిందువులేనని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో పత్రికా స్వేచ్ఛ గురించి మాత్రమే ప్రస్తావించిన గోస్వామి.. సోనియా పేరును ఎక్కడా వాడలేడు. కానీ 3వారాల మినహాయింపు లభించిన తర్వాత మీడియాకు విడుదల చేసిన వీడియోలో మాత్రం.. సోనియాను, కాంగ్రెస్ పార్టీని వదలబోనని ఆయన హెచ్చరించారు.

రేవంత్ లేఖ.. టీ సర్కారును నోటీసులు..

రేవంత్ లేఖ.. టీ సర్కారును నోటీసులు..

అర్నబ్ గోస్వామికి అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు.. అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్ ల విషయంలో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తెలంగాణతోపాటు కేసులు నమోదైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లకు కూడా సుప్రం నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే, లోక్ సభ సభ్యురాలైన సోనియా గాంధీపై అర్నబ్ గోస్వామి అనుచితంగా వ్యాఖ్యలు చేశాడని, ఇది సభ్యుల గౌరవమర్యాదలకు సంబంధించిన విషయంకావునా వెంటనే జోక్యం చేసుకోవాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం ఓ లేఖ రాశారు.

  High Court Dismisses GO'S On English Medium In AP Govt Schools
  ఇదీ అసలు కథ..

  ఇదీ అసలు కథ..

  మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఈనెల 16న ముగ్గురు వ్యక్తుల్ని స్థానికులు కొట్టిచంపారు. లాక్ డౌన్ వేళ అనుమానాస్పదంగా సంచరిస్తోన్న వాళ్లను దొంగలుగా భావించి గ్రామస్తులు దాడి చేశారు. పోలీసులు సకాలంలో చేరుకున్నా ప్రాణాలను కాపాడటంలో విఫలమయ్యారు. దీనికి సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన నేతృత్వంలో నడుస్తోన్న మహారాష్ట్ర సర్కారుపై అర్నబ్ రిపబ్లిక్ టీవీలో వార్తలు, చర్చలు ప్రసారమయ్యాయి. సాధువుల్ని కొట్టి చంపింది ముస్లింలేనని అర్నబ్ వాదించారు. ప్రభుత్వం మాత్రం ఆ వాదనను కొట్టిపారేసింది. ఆ తర్వాత అర్నబ్ కాంగ్రెస్ అధినేత్రిపై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో వివాదం మరింత పెద్దదైంది. దేశవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. వాటిపై సుప్రంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది.

  English summary
  The Supreme Court on Friday granted journalist Arnab Goswami protection from coercive action for three weeks in various cases filed against him. congress mp revanth reddy complaint to lok sabha speaker on same issue on friday
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X