వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లోక్ సభ ఎన్నికలతో ముగియనుంది. దాదాపు ఆరునెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో పలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడటంతో .. సమయం వృధా అవుతోంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ షురూ ..?

ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ షురూ ..?

ఓ వైపు మండలి ఎన్నికలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికే మండల, జిల్లా పరిషత్ స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. దీంతో ఈ ఎన్నికలను మే, జూన్ లో నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అన్నిరకాల పదవులకు రిజర్వేషన్లను ఏ విధంగా నిర్ధారించాలో పేర్కొని జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు పంపించింది.

మొత్తం 535 ఎంపీపీలు

మొత్తం 535 ఎంపీపీలు

రాష్ట్రంలో మొత్తం 535 మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఉండబోతున్నాయి. వీటిలో షెడ్యూల్ ప్రాంతాల్లో సహా ఎస్టీలకు 57, ఎస్సీలకు 101, బీసీలకు 121 స్థానాలకు కేటాయిస్తారు. షెడ్యూల్ ప్రాంతాల్లో తప్పించి మిగతా చోట్ల అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితమవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ విధంగా రిజర్వేషన్ల ప్రక్రియను రూపొందిస్తోంది ప్రభుత్వం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ కు కూడా ఈ విధానంలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని పదవులకు సంబంధించి ఏ రీతిలో నిర్ధారించాలో పేర్కొంటూ జిల్లాలకు ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పంపించింది

జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా, బీసీలకు వారి ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను కేటాయిస్తారు. ఏయే వర్గాలవారికి ఎన్ని స్థానాలనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల పరిషత్ లకు పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ధారిస్తారు. ఎప్పటిలాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికను ప్రత్యక్షంగా .. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులను పరోక్ష పద్ధతిలోనే చేపడుతారు. ఎంపీటీసీ రిజర్వేషన్లకు మండలం, జడ్పీటీసీకి జిల్లాను యూనిట్లుగా తీసుకుంటారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవీకి మాత్రం రాష్ట్రం యూనిట్ గా ఉంటుంది. అన్ని పదవుల్లో 50 శాతాన్ని మహిళలకు లాటరీ ద్వారా కేటాయిస్తామని స్పష్టంచేశారు.

షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీలకు 50 శాతం

షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీలకు 50 శాతం

షెడ్యూల్ ప్రాంతాల మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల్లో 50 శాతానికి తగ్గకుండా ఎస్టీలకు కేటాయించాలనే నిబంధనను రూపొందించారు. ఎంపీపీ పదవులు మాత్రం ఎస్టీలకే చెందుతాయి. ఒక మండలంలో 16 ఎంపీటీసీలు ఉంటే వాటిలో 8 ఎస్టీలకు రిజర్వు అవుతాయి. మిగతా 8 ఆన్ రిజర్వుడు వర్గీకరణలోకి వస్తాయి. అలా కాకుండా 16 స్థానాలు షెడ్యూల్ కానీ ప్రాంతాల్లో ఉంటే అక్కడ ఎస్టీలకు 5, ఎస్సీలకు 2, బీసీలకు 1 కేటాయిస్తారు. మిగతా 8 స్థానాలు ఎవరికీ రిజర్వ్ కావు . మొత్తం 50 శాతం రిజర్వేషన్లలోనూ ఎస్టీ, ఎస్సీలకు ఇవ్వగా మిగిలిన వాటిని మాత్రమే బీసీలకు ఇస్తారు. ఎంపీపీకి కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఇలాంటి సమయంలో ఎస్టీ, ఎస్సీలకు జనాభా నిష్పత్తిలో స్థానాలను ఖరారు చేసి, మిగతా వాటిని మాత్రమే బీసీలకు ఖరారు చేస్తారు.

ఎస్టీలకు 57, ఎస్పీలకు 101, బీసీలకు 121 ఎంపీపీ పదవులు
రాష్ట్రంలో మొత్తం 535 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. వీటిలో షెడ్యూల్ మండలాలు 24, కాగా నాన్ షెడ్యూల్ 511 ఉన్నాయి. షెడ్యూల్ ప్రాంతాల్లోని 24 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఎస్టీలకే చెందుతాయి. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 6.40 శాతం ఉండటంతో వారికి మరో 33 అధ్యక్ష పదవులు ఇక్కడ రిజర్వవుతాయి. ఇలా ఎస్టీకి రెండు చోట్ల కలిపి మొత్తం 57 ఎంపీపీ పదవులు దక్కుతాయి. ఎస్సీ జనాభా 19.67 శాతం ఉన్నందున వారికి 101 ఎంపీపీ పదవులు దక్కుతాయి. మొత్తం 50 శాతంలోనూ ఇలా వీరికి ఇవ్వగా మిగిలే 121 స్థానాలు బీసీలకు చెందుతాయి. మిగిలిన 256 అధ్యక్ష పదవులు ఆన్ రిజర్వ్ డ్ వర్గీకరణలో చేరి ఎవరైనా పోటీ చేసేందుకు వీలుగా ఉంటాయి. జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీలకు, ఎస్సీలకు వారి జనాభా ఆధారంగా, బీసీలకు వారి ఓటర్ల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. జెడ్పీ చైర్ పర్సన్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వగా మిగిలినవి ఆన్ రిజర్వ్ డ్ వర్గీకరణలో ఉంటాయి.

English summary
The Telangana Election Commission has said that elections in Mandal and district Parishad in the state will be held in May and June. The MPTC, ZPTC, MPP and ZP chairman have sent guidelines to the states to decide how to make reservation for all posts. There will be a total of 535 Mandal Parishad Presidential posts in the state. Of these, 57 are reserved for ST, 101 for SCs and 121 for BCs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X