వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ ఫ్రీ.. దరఖాస్తులు ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లభించనుంది. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫ్రీ కోచింగ్‌కు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన స్త్రీ, పురుష అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

పది ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ మేరకు ప్రాథమిక పరీక్షకు సంబంధించి ఆయా జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మెయిన్స్ పరీక్ష మాత్రం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్నారు.

 సివిల్స్ లక్ష్యానికి ఫ్రీ కోచింగ్

సివిల్స్ లక్ష్యానికి ఫ్రీ కోచింగ్

2019-2020 సంవత్సరానికి గాను నిర్వహించే UPSC- C శాట్ (సివిల్ సర్వీసెస్) ఫ్రీ కోచింగ్ కోసం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జనరల్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన 250మంది అభ్యర్థులకు అవకాశం దక్కనుంది. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నమ్మకంతో నయవంచన.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. 12 గంటలు రాక్షసక్రీడనమ్మకంతో నయవంచన.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. 12 గంటలు రాక్షసక్రీడ

జూన్ 9న ప్రైమరీ పరీక్ష

జూన్ 9న ప్రైమరీ పరీక్ష

కొత్తగా అప్లై చేసుకునే 200 మంది కొత్తవారికి, గతేడాది ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన 50 మందికి ఈ సంవత్సరం ఫ్రీ కోచింగ్‌కు అవకాశం దొరకనుంది. అందులో 75 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, 15 శాతం బీసీలకు కేటాయించారు. అయితే ఉచిత శిక్షణ కోసం స్టడీ సర్కిల్ నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. జూన్ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు.

ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం

ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 రేషియో ద్వారా ఎంపిక చేయనున్నారు. జూన్ 23వ తేదీన హైదరాబాద్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఫిల్టర్ చేయనున్నారు. అలా అర్హత పొందిన అభ్యర్థులకు చివరగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నారు. మరిన్ని వివరాలకు 040-23546552 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా www. tsstudycircle.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫ్రీ కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నారు.

English summary
Telangana SC Study Circle Given a Notification regarding free coaching for UPPSC civils aspirants. They giving chance to 250 members who belongs to SC, ST, BC community. Free Food and Boarding accommodation available while free coaching. Interested Candidates may apply online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X