వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ లోనూ స్కూలు ఫీజులు ... లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చిన పేరెంట్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇక ప్రపంచమే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న వేళ సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికే దీంతో లాక్‌డౌన్ అమలవుతున్న నాటి ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు పనుల్లేక , పైసల్లేక నానా చావు చస్తున్నారు . ఇక ఈ సమయంలో స్కూళ్ళ నుండి, కాలేజీల నుండి ఫీజులు కట్టమని అడిగితే ఆ చిరాకు ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు .

దొంగచాటుగా ప్రయాణాలు .. పోలీసులకు ఇదో తలనొప్పి .. ఆలోచించాల్సింది ప్రభుత్వాలే !!దొంగచాటుగా ప్రయాణాలు .. పోలీసులకు ఇదో తలనొప్పి .. ఆలోచించాల్సింది ప్రభుత్వాలే !!

కార్పోరేట్ స్కూళ్ళు , కాలేజీల ఆన్ లైన్ క్లాసుల వెనుక మతలబు ఇదే

కార్పోరేట్ స్కూళ్ళు , కాలేజీల ఆన్ లైన్ క్లాసుల వెనుక మతలబు ఇదే

తాజాగా అలాంటి ఒక సందర్భం చోటు చేసుకుంది. ఇక ఆ ఆడియో ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది . ఇక ఈ నేపధ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులకు తెరతీశాయి. కార్పోరేట్ స్కూళ్ళు తమ విద్యర్థుల పట్ల తమకు ఎంతో శ్రద్ధ ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఎలాగోలా క్లాసుల చెబుతున్నాం కదా, ఫీజులు కట్టమంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

 ఫీజులు కట్టాలని ఒత్తిడి ... కట్టలేమని చెప్తున్న తల్లిదండ్రులు

ఫీజులు కట్టాలని ఒత్తిడి ... కట్టలేమని చెప్తున్న తల్లిదండ్రులు

లాక్ డౌన్ తో ఉద్యోగాలు పోయిన కొందరు, వ్యాపారాలు సాగక కొందరు , జీతాల్లో కోత విధించిన కొందరు ఆర్ధిక కష్టాలలో , నష్టాలలో తెగ ఇబ్బంది పడుతుంటే స్కూల్స్ , కాలేజీల నుండి మీ పిల్లల ఫీజులు చెల్లించండి అంటే ఇక ఆ పరిస్థితి తల్లిదండ్రులకు ఎంత ఇబ్బందికరమో అర్ధం చేసుకోవచ్చు . లాక్‌డౌన్ సమయం నుంచి ఉపాధి లేక అల్లాడుతుంటే.. ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. కొందరు పిల్లల చదువులు ఎలా అని బాధ పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా స్కూల్ ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యం మాత్రం ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఫీజు కట్టమంటే ఓ విద్యార్థి తండ్రి రెస్పాన్స్ ఆడియో వైరల్

ఫీజు కట్టమంటే ఓ విద్యార్థి తండ్రి రెస్పాన్స్ ఆడియో వైరల్

తాజాగా ఓ విద్యార్థి తండ్రికి కాల్ చేసిన స్కూల్ సిబ్బందిలో ఓ వ్యక్తి ఫీజు కట్టమని అడిగితే ఫోన్‌లోనే ఆ తండ్రి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాడు. మీకసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించాడు . అసలు లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు పెట్టమని మీకు ఎవరు చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రతకటం ఎలాగా అని బాధ పడుతుంటే మీకు చదువులు కావాలా అని గట్టిగా నిలదీశారు. అసలే పనుల్లేక , ఇళ్లకే పరిమితమై చాలా ఇబ్బందిలో ఉన్నామని , ఇంకెవరినీ ఈ తరహా ఫీజుల కోసం అడగొద్దని , అనవసరంగా తిట్లు తినొద్దని వాయించేశారు.

Recommended Video

Coronavirus : 21 Indian Navy Sailors Test Positive For COVID-19
 ఫీజు కట్టలేమని ఆగ్రహం.. మానవత్వం ఉందా అని ప్రశ్న .. ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఫీజు కట్టలేమని ఆగ్రహం.. మానవత్వం ఉందా అని ప్రశ్న .. ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఈ వ్యవహారం సీఎం కేసీఆర్ దాకా తీసుకెళ్తామని గడ్డి పెట్టారు . మీ యాజమాన్యం ఎవరో వాళ్ళ నంబర్ ఇవ్వండి మేం మాట్లాడతాం .. ఫీజులు ఇప్పుడు కట్టలేం అని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ ముగిసి యధావిధిగా పనులు సాగేవరకు ఫీజులు అడగొద్దని ఆ తండ్రి పేర్కొన్నారు . ఈ టైం లో ఫీజులు అడగటానికి నోరెలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెవరికి ఇలా ఫోన్లు చెయ్యొద్దని హితవు పలికారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని స్కూళ్ళు , కాలేజీల ఫీజుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సామాన్య , మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు.

English summary
During Lockdown, private schools opened to online classes. Corporate schools are conducting online classes that build a strong interest in their students. No matter how the classes are told,they are putting pressure on the parents for fees. The school staff who recently called a father of a student asked him to pay a fee, and the father gave a left and right class over the phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X