వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపులు: విద్యార్థినులకు పొట్టి దుస్తులు వద్దని కొండా సురేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాఠశాల విద్యార్థినులకు పొట్టి దుస్తుల యూనిఫాంకు బదులుగా సల్వార్ కమీజ్ ప్రవేశపెట్టాలని మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సూచించారు.

శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నాలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉందని తెలిపారు.

ముఖ్యంగా పదోతరగతి బాలికలకు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. చాలా పాఠశాల్లలో యూనిఫామ్ పొట్టి దుస్తులేనని, ఆ పద్ధతిని మార్చేందుకు సల్వార్ కమీజ్‌ను డ్రెస్ కోడ్‌గా తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు.

Schoolgirls should wear salwar kameez to avoid harassment: Konda surekha

బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని పాఠశాల నుంచి డిబార్ చేయాలని, అటువంటి విద్యార్థులకు ఏ పాఠశాలలోను కూడా అడ్మిషన్ ఇవ్వకూడదని అన్నారు.

విద్యార్థినులను వేధింపులకు గురిచేయాలనే ఆలోచన కూడా రాకుండా కఠిన శిక్షలు ఉండాలన్నారు. అంతేకాకుండా, తోటి మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ డిమాండ్ చేశారు.

English summary
In an attempt to curb sexual harassment cases in school, a woman legislator of the ruling Telangana Rashtra Samiti advised that short dresses should be replaced with salwar kameez as school uniform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X