విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూపర్ ‘సౌత్ సెంట్రల్ రైల్వే’: సోషల్ మీడియాలో కూతురు ఏడ్చిన ఫొటో.. ఆమె ట్యాబ్ తిరిగొచ్చింది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ అమ్మాయి తన టాబ్లెట్(ట్యాబ్)ను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆ విషయం గుర్తించిన ఆ చిన్నారి చిన్నబోయింది. తనకు తన ట్యాబ్ కావాలంటూ ఏడుస్తూ కూర్చుంది. దీంతో ఆ అమ్మాయి తండ్రి ఆమె ఫొటోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోనే ఆమె ట్యాబ్‌ను ఆమెకు తిరిగివచ్చేలా చేసింది.

ట్యాబ్ పోగొట్టుకున్న చిన్నారి..

ట్యాబ్ పోగొట్టుకున్న చిన్నారి..

ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ముస్తఫా సాదిఖ్ అనే వ్యక్తి సోమవారం తన కుమార్తె ఏడుస్తున్న ఫొటోను సోషల్ మీడియా(ట్విట్టర్)లో పోస్టు చేశారు. విశాఖపట్నం నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో తన కూతురు హైదరాబాద్ నగరానికి వచ్చిందని.. బీ-11 కోచ్, సైడ్ అప్పర్ బెర్త్‌లో ఆమె ప్రయాణించిందని వ్యాఖ్యానించారు. అక్కడే ఆమె తన ట్యాబ్‌ను పోగొట్టుకుందని పేర్కొన్నారు.

ఏడుస్తూ కూర్చున్న అమ్మాయి..

ఏడుస్తూ కూర్చున్న అమ్మాయి..

ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసుకుని ఏడుస్తూ కూర్చుందని తన పోస్టుతోపాటు ఈ వ్యాఖ్యలు జోడించారు ముస్తఫా. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ... సౌత్ సెంట్రల్ రైల్వేను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌పై రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.

వెంటనే స్పందించిన రైల్వే అధికారులు..

వెంటనే స్పందించిన రైల్వే అధికారులు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ట్యాబ్ దొరుకుతుందేమోనని అధికారులు, సిబ్బంది సాయంతో వెతికించారు. నిజానికి విద్యాసాగర్ అనే రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగికి ఆ ట్యాబ్ దొరికింది. దానిని ఆయన అధికారులకు అప్పగించారు.

చిన్నారి ముఖంలో ఆనందం నింపిన రైల్వే అధికారులు..

చిన్నారి ముఖంలో ఆనందం నింపిన రైల్వే అధికారులు..

ఈ విషయాన్ని అధికారులు ముస్తఫాకు తెలియజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్‌ను కలిసి ఆ ట్యాబ్ తీసుకోవాలని ట్వీట్ చేశారు. దీంతో తన ట్యాబ్ మళ్లీ తన దగ్గరికి వస్తుందని తెలిసి ఆ అమ్మాయి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఏడుస్తున్న ఆమె ముఖంలో నవ్వులు విరిశాయి. ఆ ట్యాబ్‌ను తిరిగి తన కూతురుకు ఇచ్చే పనిలో ఉన్నాడు తండ్రి ముస్తఫా. మొత్తానికి రైల్వే అధికారులు సకాలంలో స్పందించడంతో ఆ అమ్మాయి ముఖంలో ఆనందం చూశాడు ఆ తండ్రి. నెటిజన్లు కూడా రైల్వే అధికారులకు అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

English summary
South Central Railway came to the rescue of Anjum Fatima, a young girl who forgot her mobile tablet in a train while travelling from Visakhapatnam to Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X