• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ గొర్రెలకు మరో రూ.6వేల కోట్లు -రెండో విడత పంపిణీకి సీఎం ఆదేశం -కుల వృత్తులకు ఇంకా ప్రోత్సాహం

|

తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్నాయని, బీసీల అభ్యున్నతి కోసం తెలంగాణ సర్కారు చేపట్టిన పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి - ప్రభుత్వ కార్యాచరణ - రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్ లో మంగళవారం సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా..

అవును, చంద్రబాబుకు whatsapp చేశా, తప్పేంటి? -సీఎం జగన్ pegasus వాడట్లేదా? :ఎంపీ రఘురామ మరో బాంబుఅవును, చంద్రబాబుకు whatsapp చేశా, తప్పేంటి? -సీఎం జగన్ pegasus వాడట్లేదా? :ఎంపీ రఘురామ మరో బాంబు

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు.

second phase of sheep Distribution soon, telangana govt cares for backward castes, says cm kcr

రెండో విడత గొర్రెల పంపకానికి కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాంతో మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతే కాకుండా ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.

నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు.

 porn videos case: నగ్నంగా ఆడిషన్ -శిల్పా షెట్టి భర్తపై సాగరిక బాంబు -23దాకా రిమాండ్ -షెర్లిన్ పూనమ్ కూడా porn videos case: నగ్నంగా ఆడిషన్ -శిల్పా షెట్టి భర్తపై సాగరిక బాంబు -23దాకా రిమాండ్ -షెర్లిన్ పూనమ్ కూడా

ఇటీవల ఓ సభలో సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న గొర్రెలను ప్రజలంతా 'కేసీఆర్ గొర్రెలు'అని పిలుస్తున్నట్లు చెప్పడం తెలిసిందే. ఇక, రెండ్రోజుల కిందటే దళితబంధు పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్.. త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ సెట్మెంట్ లో దానిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంబించనుండటం తెలిసిందే. అంతలోనే బీసీల స్థితిగతులపైనా రివ్యూ చేపట్టిన సీఎం.. గొర్రెల పంపిణీకి ఆదేశాలిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఇలాంటి ప్రకటనలు మరిన్ని రావొచ్చని తెలుస్తోంది.

English summary
CM KCR said that the second installment of sheep distribution will start soon in Telangana. He clarified that Rs 6,000 crore has been allocated for the second tranche. A high level review meeting chaired by CM KCR was held on Tuesday at Pragati Bhavan on the issue of upliftment of BCs, the occupational castes in Telangana - Government activity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X