వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ కోసం సచివాలయాన్ని కూలుస్తామంటే ఒప్పుకోం..! న్యాయ పోరాటం చేస్తామన్న రేవంత్ రెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ కు వాస్తు పిచ్చి.. కేటీఆర్‌ కోసం సచివాలయాన్ని కూలుస్తారా..?? || Oneindia Telugu

హైదరాబాద్‌: సచివాలయ కూల్చివేత కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నంత తేలక వ్యవహారంలా కనిపించడం లేదు. ఇంకా తక్కువలో తక్కువ 50ఏళ్లపాటు ఎలాంటి సమస్యతలెత్తకుండా నిర్మించిన భవంతులను కూల్చేసి, వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. అంతే కాకుండా సచివాలయ సముదాయలను కూల్చివేస్తే న్యాయపోరాటం చేస్తామవని మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ నేథ్యంలో సచివాలయ భవంతల తొలంగింపు, నూతన నిర్మాణాలు అంత తేలికగా జరిగే పని కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకు వాస్తు కారణాలు చూపి పటిష్టంగా ఉన్న భవంతులను కూల్చేస్తామంటే సహించేది లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.

 కొడుకు సీఎం కాలేడని సచివాలయాన్ని కూల్చేస్తారా? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామ రేవంత్‌రెడ్డి..!

కొడుకు సీఎం కాలేడని సచివాలయాన్ని కూల్చేస్తారా? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామ రేవంత్‌రెడ్డి..!

ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేసి, కొత్త భవనాలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీర్ఘకాలం మన్నిక, నిర్మాణ పటిష్టత ఉండేలా నిర్మించిన భవనాలను కూల్చేయాలనుకోవడం ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం కలిగించడమే అవుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు కాకపోవడంతో సచివాలయానికి వాస్తుదోషం ఉందని సీఎం చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని, ఇదే సచివాలయం ఉంటే తన కొడుకు కేటీఆర్‌ కూడా సీఎం కాలేడనే ఉద్దేశంతోనే భవనాలను కూలగొడుతున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. ఘాటుగా విమర్శించిన రేవంత్...

సీఎం కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. ఘాటుగా విమర్శించిన రేవంత్...

వాస్తు నమ్మకం వేరు.. వాస్తు పిచ్చి వేరు అని, చంద్రశేఖర్ రావు వాస్తు పిచ్చితో వ్యవహరిస్తూ.. ప్రజలను పట్టించకోవడం లేదని విమర్శించారు. తమ విలాసాల కోసం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుబట్టారు. భవనాల కూల్చివేతకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేమని, అవసరమైతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిని కలిసి వినతిపత్రం సమర్పించారు. భవనాలను కూల్చకుండా నిరోధించాలని కోరారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 మంది మంత్రులకు భవన సదుపాయం కల్పించేలా, దాదాపు 25 ఎకరాల్లో 9.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన భవనాలను కూల్చేయడం తగదన్నారు.

వందేళ్ల మన్నిక ఉండే భవనాలు..!కూల్చివేతకు వ్యతిరేకమన్న కాంగ్రెస్‌..!!

వందేళ్ల మన్నిక ఉండే భవనాలు..!కూల్చివేతకు వ్యతిరేకమన్న కాంగ్రెస్‌..!!

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 10 కోట్ల మంది ప్రజల అవసరాలకు అనుగుణంగా కోట్లాది రూపాయలు వెచ్చించి సచివాలయ భవనాలను నిర్మించారు. ఇందులో ఎక్కువ బ్లాకులు 2004 తర్వాత నిర్మించినవే. వందేళ్లపాటు మన్నేలా అన్ని ప్రమాణాలు పాటిస్తూ వీటిని నిర్మించారు. 42 మంది మంత్రులకు చాంబర్లు, వారి శాఖల కార్యాలయాలకు సరిపడా భవన వసతిని కల్పించారు. సచివాలయ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా సచివాలయ ప్రాంగణంలోనే మసీదు, దేవాలయం ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన భవనాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసి.. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. వీటికి ఇంకా కనీసం 50 నుంచి 70 ఏళ్ల మన్నిక ఉందని రేవంత్ వివరించారు.

 కూల్చివేతతో ప్రభుత్వ ఖజానాకు నష్టం..! ప్రభుత్వ ఆస్తులను సీఎస్‌ పరిరక్షించాలన్న ఎంపీ..!!

కూల్చివేతతో ప్రభుత్వ ఖజానాకు నష్టం..! ప్రభుత్వ ఆస్తులను సీఎస్‌ పరిరక్షించాలన్న ఎంపీ..!!

అంతే కాకుండా ఈ భవనాల్లో సచివాలయాన్ని నడపడమే కాకుండా.. బయట పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ కొనసాగిస్తున్న ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు కూడా భవన వసతిని కల్పించే వీలుంది' అని రేవంత్‌ వివరించారు. ప్రభుత్వం కొత్త సచివాలయమే కావాలనుకుంటే కొత్తవాటిని నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విలాసాలు, ప్రతిష్ఠ కోసం ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులతో కొత్త భవనాలు నిర్మించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. సీఎస్‌.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షుడిగా భవనాల కూల్చివేతను నిరోధించాలని కోరారు. ఇక్కడ సచివాలయాన్ని నడపవద్దనుకుంటే.. ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలన్నారు.

English summary
TPCC Working President and MP Revant Reddy vehemently opposed the decision of the state government to demolish the existing Secretariat buildings and construct new buildings. They want to demolish buildings that have been built for long-lasting durability and robustness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X