• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బోధన్‌లో తీవ్ర ఉద్రిక్తత..144 సెక్షన్ విధింపు: శివాజీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఖబడ్దార్: ఎంపీ

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణపూరక వాతావరణం ఏర్పడింది. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో తలెత్తిన వివాదం గాలీవానగా మారింది. పరిస్థితులు అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. దీనితో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీకి చెందిన నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అరవింద్.. ఘాటు విమర్శలు చేశారు.

ఆవిష్కరణ కార్యక్రమాన్ని..

ఆవిష్కరణ కార్యక్రమాన్ని..

బోధన్ టౌన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక బీజేపీ నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని అఖిల భారత మజ్లిస్-ఇ-ముస్లిమీన్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో విగ్రహావిష్కరణ వేదిక వద్దకు చేరుకున్నారు. వాగ్యుద్ధానికి దిగారు. దీనితో పరిస్థితి మరింత్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఉద్రిక్తత.. 144 సెక్షన్..

ఇరువర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఇరువర్గాలు వినిపించుకోలేదు. కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టయింది. దీనితో పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. 144 సెక్షన్‌ విధించారు.

రాత్రికి రాత్రే..

రాత్రికి రాత్రే శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి కౌన్సిలర్ ఇమ్రాన్ ప్రశ్నించారు. పెట్రోలింగ్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు తెలిసే ఇదంతా జరిగిందని ఆరోపించారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠిస్తారని నిలదీశారు. బీజేపీ నాయకులు విగ్రహాలతో రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ మజ్లిస్‌పై

కాగా- టీఆర్ఎస్ నాయకుల విమర్శలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తిప్పి కొట్టారు. శివాజీ విగ్రహం ఏర్పాటును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. మజ్లిస్ నాయకుల మెప్పును పొందడానికి టీఆర్ఎస్ పాకులాడుతోందని విమర్శించారు. మజ్లిస్ గూండాలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మజ్లిస్, టీఆర్ఎస్ నాయకులు బోధన్‌లో హిందువుల ప్రాథమిక హక్కులను కూడా హరించి వేస్తోన్నారని మండిపడ్డారు.

 పోటీగా టిప్పు సుల్తాన్ విగ్రహం

పోటీగా టిప్పు సుల్తాన్ విగ్రహం

బోధన్‌లో శివాజీ విగ్రహాన్ని నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాలంటూ తాము పోలీసు ఉన్నతాధికారుల వద్ద దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. టీఆర్ఎస్-మజ్లిస్ నాయకులు..అనుమతులు రాకుండా అడ్డుకున్నారని, తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. శివాజీ విగ్రహానికి అనుమతి ఇవ్వాల్సి వస్తే.. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని కూడా నెలకొల్పాలని డిమాండ్ చేశారని అన్నారు. హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడిన టిప్పు సుల్తాన్ విగ్రహం.. బోధన్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.

 శివాజీ విగ్రహాన్ని ముట్టుకుంటే..

శివాజీ విగ్రహాన్ని ముట్టుకుంటే..

శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలని, అనుమతులు లభించిన తరువాత ఏర్పాటు చేసుకోవాలంటూ పోలీస్ కమిషనర్.. చెబుతున్నట్లు తన వద్ద సమాచారం ఉందని ధర్మపురి అరవింద్ అన్నారు. విగ్రహాన్ని ముట్టుకుంటే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. విగ్రహాన్ని అక్కడి నుంచి కదలనివ్వమని చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన తేల్చి చెప్పారు. ఎంపీ టికెట్ కోసం పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఎదురు చూస్తున్నారని ఆరోపించారు.

English summary
Section 144 was imposed in Bodhan town of Telangana’s Nizamabad district after clashes between members of two political factions over the setting up of a Shivaji statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X