వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంట్రల్‌ జైల్లో మొదలైన ప్రక్షాళన: ఓపెన్‌ సెల్‌ నుంచి బ్యారక్‌ల్లోకి ఖైదీలు

వివాదాస్పద ఖైదీలను గుర్తించి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అండా సెల్స్‌, 24 సెల్స్‌ ఓపెన్‌ సెల్స్‌లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : సెంట్రల్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయిన ఘటన.. జైళ్లశాఖను కుదిపివేస్తోంది. అధికారులతీరుపై జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ కన్నెర్ర చేస్తున్నారు. డీజీ ఆదేశాల మేరకు అధికారులు జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జైలులో రెండు రోజులుగా 'ఆపరేషన్‌ ప్రిజనర్స్‌ బ్యారక్స్‌' పేరుతో సోదాలు నిర్వహిస్తున్నారు.

వివాదాస్పద ఖైదీలను గుర్తించి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అండా సెల్స్‌, 24 సెల్స్‌ ఓపెన్‌ సెల్స్‌లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రధానంగా చర్లపెల్లి జైలు నుంచి క్రమశిక్షణ ఉల్లంఘించి ఇక్కడకు వచ్చిన ఖైదీలపై ప్రత్యేక దృష్టి సారించారు.

అంతే కాకుండా పాకిస్తాన్‌ ఖైదీలు, ఐఎస్‌ఐ ఖైదీలు హైదరాబాద్‌ స్నేక్‌ గ్యాంగ్‌, నయీమ్‌ అనుచరులను గర్తించి వారు ఉంటున్న పరిసరాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చిన ఖైదీల బ్యారక్‌ల చుట్టూ భూమిలో ఏమైనా నిషేధిత వస్తువులు దాచిఉంచారా? అన్న అనుమానంతో తనిఖీలు కూడా చేసినట్లు సమాచారం.

 Security tightening in Warangal central jail

లెక్కకు మిక్కిలి వస్తువులు

శిక్ష పడ్డ ఖైదీలకు, అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు జైలులో లెక్కకు మిక్కిలి వస్తువులు ఉన్నట్టు అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ఖైదీలు సైనిక్‌ సింగ్‌, రాజేశ్‌ యాదవ్‌ 8 బ్లాంకెట్లు సమకూర్చుకుని జైలు నుంచి పారిపోయినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై జైలు సూపరింటెండ్‌, డిప్యూటీ సూపరిండింటెండ్ ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ క్రమంలో రెండు రోజులుగా భద్రసర్కిల్‌లోని హై సెక్యూరిటీ బ్యారక్‌లు, 24 సెల్స్‌ అండాసెల్స్‌, ఓపెన్‌ సెల్స్‌, ఎల్లోర (అండర్‌ ట్రయల్‌) బ్యారక్ లను తనిఖీలు చేపట్టారు. అలాగే 840 మంది ఖైదీలు ఉంటున్న ప్రదేశాన్ని తనిఖీ చేసి హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో ఖైదీ వద్ద ఒక బ్లాంకెట్ (చెద్దరు), కార్పేట్లు, ప్లేట్లు, గ్లాసు, బకెట్, దిండు ఉండాలి.

కాని ఒక్కొక్కరి వద్ద 5 నుంచి 8 చెద్దర్లు, బకెట్లు, ఇనుప చువ్వలు, వాడిన బ్లేడ్లు, గుట్కాలు, సిగరేట్లు, అంబర్లు కనిపించడంతో అధికారులు విస్తుపోయారు. ఖైదీల సెల్స్‌ నుంచి అనవసరపు వస్తువులను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

గతంలో ఒక బ్యారక్‌లో ముగ్గురు నుంచి 11 మంది వరకు ఖైదీలు ఉండే వారు. అయితే కరడుగ్టిన ఖైదీలు తోి వారి సహకారంతో తప్పించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని గుర్తించి బ్యారక్‌కు ఒక్క ఖైదీ మాత్రమే వుండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే జైలులో పాతకాలం నాటి తాళాలు ఉండడంతో వాటిని తొలగించి అన్ని బ్యారక్‌లకు కొత్త తాళాలలను వేశారు.

జైలులో కరడుగ్టిన ఖైదీలు ఉండే ప్రతాలను గుర్తించి అక్కడ విధులు నిర్వర్తించేందుకు మెరికల్లాంటి సిబ్బందిని కేయించారు. అంతేకాకుండా హెచ్‌ఎస్‌బీ హై సెక్యూరిటీ బ్యారక్స్‌ ప్రతాంతాల్లో హైమాస్‌ లైట్లు అమర్చారు. రాత్రి పహారాకాసే సిబ్బందికి డ్రాగన్‌ లైట్లు సమకూర్చారు.
చురుగ్గా చర్యలు

జైలులో పరిస్థితులను చక్కదిద్దేందుకు కొత్త సూపరింటెండ్‌ెం మందారపు సంపత్‌ చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. కొత్త సిబ్బందికి (వార్డర్స్‌)కు పెద్ద పీట వేయడం ద్వారా లోపాలు, అక్రమాలకు తావులేకుండా ప్రయత్నిస్తున్నారు. వివాదాస్పద ఖైదీలను గుర్తించి క్రమశిక్షణ కొరడా ఝుళిస్తున్నారు. జైళ్లశాఖలో అవినీతిని నిర్మూలించాలని కోరుతూ సంపత్‌ గతంలో సైకిల్‌ యాత్రం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. చురుకైన అధికారిగా పేరుపొందిన సంపత్‌ జైలును గాడిన పెడగారని భావిస్తున్నారు.

నలుగురు దొంగల అరెస్టు
రూ. 3 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

వరంగల్‌ : వరంగల్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తకాగితాలు ఏరుతున్నట్లు నిస్తూ, పలు ఇళ్లలో దొంగతనాలు చేసే నలుగురు దొంగలను వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ శ్రీధర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ శివనగర్‌ సమీపంలోని పుప్పాలగుట్ట ప్రాంతానికి చెందిన తూర్పాి మైసమ్మ, తూర్పాి మల్లమ్మ, సిరిపాటి సమ్మక్క, తూర్పాటి లక్ష్మిలు వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లో తిరుగుతూ చెత్త కాగితాలు సేకరిస్తున్నట్లు ప్రజలను నమ్మిస్తారు.

ఎవరూ లేని ఇండ్లను గుర్తించి రాత్రి వేళల్లో తాళాలు పగులగ్టొి బంగారం, వెండి ఇతరత్ర విలువైన వస్తువులు అపహరిస్తారు. ఈ క్రమంలో కేయూ సీపీఎస్‌ పరిధిలో 2, కాజీపేట పరిధిలో 3, మట్టెవాడ పరిధిలో 3, మిల్స్‌కాలనీ పరిధిలో 1, గీసుకొండ పీఎస్‌ పరిధిలో 1 దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

మొత్తంగా వీరు చేసిన దొంగతనాల్లో 80 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి, 2 కిలోల ఇత్తడి, 3కిలోల అల్యూమినియం ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 3 లక్షల విలువ చేసే బంగారు, వెండితోపాటు విలువైన వస్తువులను అపహరించినట్లు తెలిపారు. కాగా, దొంగిలించిన వస్తువులను అమ్మేందుకు శుక్రవారం వరంగల్‌ బులియన్‌ మార్క్‌ెకు రాగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. వారిని పట్టుకుని విచారించగా చేసిన తప్పులను ఒప్పుకున్నాట్టు తెలిపారు. బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

English summary
After Two prisoners escaped from warangal central jail security was tightening. According DG instructions officials were making special security arrangements
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X