వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఉద్యోగుల అవినీతీ మాకే చెప్పండి :రెవెన్యు శాఖ బ్యానర్లు

|
Google Oneindia TeluguNews

స్వియ రక్షణలో తెలంగాణ రెవెన్యు ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమ పై వచ్చిన ఆరోపణలకు తామే చెక్ పెట్టే చర్యలను చేపడుతున్నారు.ఇందులో భాగంగానే రెవెన్యు కార్యాలయాల ముందు అవినీతికి పాల్పడే ఉద్యోగుల పై ఫిర్యాధులు చేసేందుకు అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.మరో వైపు రెవెన్యు శాఖ పై సీఎం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టే ప్రయాత్నాల్లో ఉన్నారు.

 రెవెన్యు శాఖలో అవీనితి అంటూ సీఎం వ్యాఖ్యలు

రెవెన్యు శాఖలో అవీనితి అంటూ సీఎం వ్యాఖ్యలు

తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగుల నీతీ, అవినీతీ పై చర్చ జరుగుతోంది..ముఖ్యంగా ముఖ్యమంత్రి మానస పుత్రికగా చెప్పుకుంటున్న భూరికార్డుల ప్రక్షాళన రెవెన్యు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యు శాఖ అనేక ఇబ్బందులకు రైతులను గురి చేసినట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో పాటు ప్రతి పనికి లంచం తీసుకుని వారు రికార్డులు ప్రక్షాళన చేసినట్టు పలు చోట్ల ఆరోపణలు వచ్చాయి. అయితే సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో పలు చోట్ల వచ్చిన ఆరోపణలతో సీఎం దీనిపై సీరియస్ గా దృష్టి సారించారు.ఈనేపథ్యంలోనే సీఎం నేరుగా సోషల్ మీడియాలో వచ్చిన రైతు సమస్యపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా రైతు నేరుగా సంబంధిత రెవెన్యు ఉద్యోగిపై ఆరోపణలు చేయడంతో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో ప్రభుత్వ డిపార్ట్మెట్లలో ఎక్కువగా అవినీతి కల్గిన డిపార్ట్మెంట్ గా రెవెన్యు శాఖ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏకంగా సీఎం ఒక శాఖ లో అవినీతిని ప్రస్తావించారంటే అందులో ఎంత పెద్ద మొత్తం లో అవినీతీ జరగుతుందో అర్ధం చేసుకోవచ్చు .

తమ పై ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఉద్యోగుల ప్రయత్నాలు

తమ పై ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఉద్యోగుల ప్రయత్నాలు

ఈనేపథ్యంలోనే రెవెన్యు ఉద్యోగులు తమ పై వస్తున్న ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో క్రింది స్థాయి సిబ్బంది చేసే తప్పులకు తాము బలి అవుతున్నామని భావించిన రెవెన్యు అధికారులు ,తమ శాఖను తామే సంస్కరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే కార్యాలయాల ముందు అవినీతీ రహితమైన ప్రకటనలతో కూడిన బ్యానర్లు కడుతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మార్వో కార్యాలయం ముందు ఇలాంటీ బ్యానర్ వెలిసింది. ఓకవేళ ఎవరైన ఉద్యోగులు లంచం అడిగితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని నోటీస్ బోర్డులో పెట్టారు. అయితే అందులో క్రింది స్థాయి ఉద్యోగుల నుండి ఎమ్మార్వో ఆర్డీవోలు లంచం అడిగినా పై అధికారులకు ఫిర్యాదులు చేయాలని సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను ఇచ్చారు. సో ఇలా ఓ వైపు తమ శాఖపై వచ్చిన మచ్చను తామే తుడుచుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తమపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆందోళన బాట సైతం పడుతున్నారు రెవెన్యు ఉద్యోగులు.

సీఎం తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్న ఉద్యోగులు

సీఎం తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్న ఉద్యోగులు

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో వారు ఆందోళన బాట పట్టారు. సీఎం తమని అవమానాలకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత అయిదు సంవత్సరాల్లో రెవెన్యూ ఉద్యోగులు చేసిన సేవలను అసెంబ్లీలో ప్రశంసించిన సీఎం ఇప్పుడు అలా అనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాగా ఒక్క రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాళన చేస్తే అవినీతి అంతమవుతుందా అంటూ వారు ప్రశ్నించారు. రాష్ట్రంలోని మిగతా ఉద్యోగుల్లో కూడ అవినీతీ ,అలసత్వం ఉందని అన్నారు. కాగా రెవెన్యూ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిందని ,అందుకే ఆ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాళన చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే రెవెన్యూ ఉద్యోగులు సీఎం కేసీఆర్ తమను అవమానిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు హైద్రబాద్ లో సమావేశంమైన ఉద్యోగులు ఈ అంశంపై చర్చించారు. కాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులకు క్షమాపణ చేప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ స్థాయిలో అవినీతి గురించి మాట్లాడడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పోవాలంటే ముందుగా సీఎం స్థాయిలో అవినీతిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రంలో అవినీతీ ఉండదని వారు వ్యాఖ్యానించారు. కాగా ఈ సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘాలనేతలు పాల్గోన్నారు.

English summary
telangana Revenue Department taking serious actions on bribe allegations, officers teking self- Action on employees corruption, part of this they disply the contact numbers of officers for bribe comolaints, at same time they are going to agitation by cm kcr comments on revenue dpt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X