వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లిక్కర్ కు నో అన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజా సడలింపులలో భాగంగా మద్యం విక్రయాలు కొనసాగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశాయి . ఇక దీంతో దేశంలో చాలా చోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో సైతం మద్యం షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. దేశ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా చాలా చోట్ల మద్యం షాపులు తెరుచుకున్నాయి.

వైన్స్ ముందు కిలోమీటర్ల మేర క్యూ .. తెలంగాణాలోనూ మందుబాబుల మద్యం తిప్పలు షురూవైన్స్ ముందు కిలోమీటర్ల మేర క్యూ .. తెలంగాణాలోనూ మందుబాబుల మద్యం తిప్పలు షురూ

లిక్కర్ విక్రయాలపై సీఎం కేసీఆర్ సీరియస్ ఆదేశాలు

లిక్కర్ విక్రయాలపై సీఎం కేసీఆర్ సీరియస్ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల ఆలస్యంగా వైన్‌షాపులను ఓపెన్ చేశారు. అయితే, అప్పటికే ఏపీలో మందుబాబుల వీరంగం చూసిన సీఎం కేసీఆర్ మందుబాబులకు, వైన్స్‌ షాపులకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. తప్పనిసరిగా మాస్క్‌ వాడాలని, భౌతికదూరం పాటించాలని తేల్చి చెప్పారు. ఇక ఎక్కడైనా మద్యం కొనుగోలులో రూల్స్ పాటించకుండా ఎక్కువ చేస్తే మద్యం షాపులు మళ్లీ మూసివేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ కు మందుబాబులు జాగ్రత్త పడుతున్నారు.

మాస్కులు ధరించాలి , సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న సీఎం కేసీఆర్

మాస్కులు ధరించాలి , సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న సీఎం కేసీఆర్

ఇక షాపుల వాళ్ళు సామాజిక దూరం పాటించకున్నా , మాస్కులు లేకుండా వచ్చిన వారికి లిక్కర్ అమ్మినా , నిబంధనలు పాటించకున్నా, షాపుల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ . ఇక సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ , నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు మందు బాబులు, అలాగే వైన్స్ నిర్వాహకులు . ఇక వారిని కట్టడి రంగంలోకి దిగారు అధికార యంత్రాంగం . ఒక పక్క పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ,అలాగే మున్సిపల్ అధికారులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని నిఘా పెట్టారు.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
సిరిసిల్లలో వైన్స్ కు 5 వేల రూపాయల జరిమానా .. రూల్స్ పాటించని ఫలితం

సిరిసిల్లలో వైన్స్ కు 5 వేల రూపాయల జరిమానా .. రూల్స్ పాటించని ఫలితం

ఈ క్రమంలోనే మాస్కు లేనివారికి మద్యం అమ్మినందుకుగాను ఓ మద్యం దుకాణానికి జరిమానా వేశారు అధికారులు . సిరిసిల్లలోని ఓ వైన్స్‌కు మాస్కు ధరించకుండా వచ్చిన పలువురికి మద్యం విక్రయించారు. ఇక మాస్క్ లేకుంటే లిక్కర్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా సరే పాటించని వారికి లిక్కర్ అమ్మినందుకు గాను దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిరిసిల్ల పురపాలక కమిషనర్‌ సమ్మయ్య సంబంధిత వైన్స్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే ఎవరి మీద అయినా సరే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

English summary
Officers fined a liquor store for selling alcohol to who were not wore a mask . The wines in Sirisilla was sold to many who had not come with masks . Sirisilla Municipal Commissioner Sammaiah has fined the related wines Rs.5,000
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X