వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నీ పేషెంట్‌కు కేటీఆర్ సహాయం: ట్విట్టర్ ద్వారా దృష్టికి రావడంతో..

తాజాగా ట్విట్టర్ ద్వారా ఓ కిడ్నీ పేషెంట్ సమస్య గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆమెకు చేయూతనందించేందుకు అంగీకరించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మిగతా పొలిటిషియన్ల కంటే ముందుంటారు. సమస్య ఏదైనా సరే.. ఆయన దృష్టికి వచ్చిందంటే తక్షణం దానిపై స్పందిస్తూ.. నెటిజెన్లతో సైతం భేష్ అనిపించుకుంటున్నారు.

Send me the details. Will make sure she is helped says KTR

తాజాగా ట్విట్టర్ ద్వారా ఓ కిడ్నీ పేషెంట్ బాధను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది హృదయ అనే ఓ స్వచ్చంద సంస్థ. ఉప్పల్ లో ఓ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న కరుణ
(55) అనే మహిళకు ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోవడంతో.. ఆరోగ్య పరిస్థితి విషమించింది. కారుణ్య ఆర్పాన్ అండ్ ఓల్డేజ్ హోమ్ ను నిర్వహిస్తున్న కారుణ్య.. మొత్తం 70మంది అనాథ చిన్నారులు, వితంతువులు, నలుగురు వృద్ధులకు సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమెకు ఆపరేషన్ నిమిత్తం రూ.3లక్షలు ఖర్చు అవుతాయని.. ఇందుకోసం ప్రభుత్వం తరుపున సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను కోరింది హృదయ స్వచ్చంద సంస్థ. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. పూర్తి వివరాలను అందిస్తే.. తప్పకుండా ఆమెకు సహాయం అందిస్తామని హామి ఇచ్చారు.

English summary
A kidney failure patient was asked Minister KTR to help her. KTR was responded immediately to help, Send me the details. Will make sure she is helped he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X