వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీనియర్‌ తెలుగు జర్నలిస్టు కె.కరుణాకర్‌రెడ్డి(60) ఆదివారం హైదరాబాద్‌ లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటుగా పత్రికారంగంలో వివిధ హోదాల్లో పని చేసిన కరుణాకర్‌రెడ్డి ఇటీవల ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

జర్నలిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కరుణాకర్‌రెడ్డి గతంలో ఏపీయూడబ్లూజె రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఐజెయూ కౌన్సిల్‌ సభ్యుడుగా పనిచేశారు. సమాచార హక్కు చట్టంపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు ప్రెస్‌ అకాడెమీ, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణ కార్యాక్రమాల్లో కరుణాకర్‌రెడ్డి రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు.

Senior Journalist Karunakar reddy died

కరుణాకర్‌రెడ్డి మరణం పట్ల ఐజెయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌, టీయూడబ్ల్యూజే నేతలు నగునూరి శేఖర్‌, విరహత్‌ అలీ, ఎపీయూడబ్లూజే నేతలు నల్లి ధర్మారావు, ఐవి.సుబ్బారావు, ఐజేయూ నేతలు అమర్‌నాథ్‌, అంబటి ఆంజనేయులు తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు.

ఆస్పత్రి వద్ద కరుణాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కరుణాకర్‌రెడ్డి భౌతిక కాయానికి సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌లో అంత్యక్రియలు జరిగియా. కురుణాకర్‌రెడ్డికి భార్య ఇద్దరు కుమారులున్నారు.

English summary
senior journalist K Karunakr Reddy passed away in Hyderabad of Telangana. He hails from Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X