• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూతురిపై మారుతీరావుకి ఎంత పగో .. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రణయ్ హత్య చార్జ్ షీట్ !

|

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు 1600 పేజీల ఛార్జీషీటును దాఖలు చేశారు. ఇక ఈ చార్జిషీట్లో పలు ఆసక్తికరమైన అంశాలను పేర్కొన్నారు పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్న మారుతీ రావు కూతురు అమృత వర్షిణి పైన మారుతీ రావు ఎంతగా పగ పెంచుకున్నాడు అనేది పోలీసులు ఈ చార్జిషీట్లో పేర్కొన్న విషయాలను బట్టి అర్ధం అవుతుంది .

చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని తప్పు అంగీకరిస్తే అప్పుడు జగన్ మాట్లాడతారన్న రోజా చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని తప్పు అంగీకరిస్తే అప్పుడు జగన్ మాట్లాడతారన్న రోజా

కుమార్తెకు చిల్లి గవ్వ కూడా ఆస్థి దక్కకుండా ప్లాన్ .. కులాంతర వివాహమే కారణం

కుమార్తెకు చిల్లి గవ్వ కూడా ఆస్థి దక్కకుండా ప్లాన్ .. కులాంతర వివాహమే కారణం

చార్జిషీట్లో పేర్కొన్న అంశాలను బట్టి కులాంతర వివాహం చేసుకుని తన పరువు తీసిన కోపంతో కుమార్తె అమృత వర్షిణికి తన ఆస్థిలో చిల్లి గవ్వ కూడా దక్కకూడదని మారుతీరావు నిర్ణయం తీసుకున్నాడు. ఆ మేరకు అమృత కు తన ఆస్థి ఏమీ చెందకుండా ఉండేలా వీలునామా కూడా రాశారని పోలీసులు ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయం తీసుకున్న మారుతీరావు ప్రణయ్ హత్య కోసం కోటి రూపాయలు సుపారీ ఇచ్చినట్లుగా ఛార్జీషీట్ లో పేర్కొన్నారు.

ప్రణయ్ ను చంపాలన్న పగ .. కోటి రూపాయలు సుపారీ ఇచ్చి బీహారీతో హత్య

ప్రణయ్ ను చంపాలన్న పగ .. కోటి రూపాయలు సుపారీ ఇచ్చి బీహారీతో హత్య


ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కూతురు కులాంతర వివాహం చేసుకోవడమే తన పరువు పోవడానికి కారణం అని భావించిన మారుతీ రావు కూతురు పైన, అదేవిధంగా ప్రణయ్ మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. ఇక వారి వివాహానికి సంబంధించిన రిసెప్షన్ వీడియోలను సోషల్ మీడియా లో చూసిన మారుతీ రావు అమృత పై, ప్రణయ్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడని అందుకోసం కిరాయి హంతకులను సైతం మాట్లాడుకుని ప్రణయ్ ను హతమార్చారని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. ఇక ప్రణయ్ హత్యకు మాజీ ఐ.ఎస్.ఐ ఉగ్రవాదులతో మారుతీ రావు కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లు గా తెలుస్తుంది. ఇక మొదట ప్రణయ్ ను చంపటానికి మిర్యాలగూడలోని స్థానికంగా ఉన్న కిరాయి ముఠాలతో సంప్రదించాలీ అనుకున్న మారుతీ రావు, పక్కా ప్రొఫెషనల్ కావాలని డిసైడ్ అయ్యారు.

 పక్కా స్కెచ్ గీసిన మారుతీరావు ... కూతురు గర్భిణీ అని కూడా చూడకుండా ప్రణయ్ హత్య

పక్కా స్కెచ్ గీసిన మారుతీరావు ... కూతురు గర్భిణీ అని కూడా చూడకుండా ప్రణయ్ హత్య


అందులో భాగంగా నల్గొండ లోని ఐఎస్ఐ మాజీ ఉగ్రవాదులు బారీ, అస్గర్ ఆలీలను సంప్రదించాడు. ఇక వారికి రాజమండ్రి జైల్లో కలిసిన బిహార్‌ వాసి సుభాష్ శర్మ అయితే పక్కాగా మిస్ కాకుండా మర్డర్ చేస్తారని భావించి దీంతో కరీంను పిలిచి హత్యకు ప్రణాళిక రూపొందిస్తానని చెప్పారని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. బీహార్ నుంచి సుభాష్ శర్మ ను రప్పించి కరీం ఇంట్లో ఉంచాడు. 45 రోజుల పాటు మకాం వేసిన సుభాష్ శర్మ ప్రణయ్ హత్య కోసం రెక్కీ నిర్వహించి రెండుసార్లు హత్యా యత్నం చేయగా అది విఫలమైంది. ఇక మూడో సారి గర్భిణీ అయిన అమృతను ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ప్రణయ్ పై దాడి చేసి విచక్షణ రహితంగా నరికి హత్య గావించారు. ఇక సుభాష్ శర్మ హత్య చేస్తున్న సమయంలో బారీ, అస్గర్ అలీలు దగ్గరలోనే ఉండి పర్యవేక్షించారు .

కూతురి జీవితం నాశనం చేసిన కసాయి తండ్రి .. కూతురిపై కక్ష సాధింపు

కూతురి జీవితం నాశనం చేసిన కసాయి తండ్రి .. కూతురిపై కక్ష సాధింపు

మారుతీ రావు కుమార్తె పై పెంచుకున్న కక్ష , ప్రణయ్ ను చంపటానికి వేసిన ప్లాన్స్ అన్నీ చార్జ్ షీట్ లో పేర్కొని కూతురి విషయంలో ఇంత కసాయిలా ప్రవర్తించిన తండ్రి మారుతీరావు ఏం చేశారో పూర్తి ఆధారాలు సమర్పిస్తున్నామని 1600 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు . మొత్తం 120 మందిని విచారించిన పోలీసులు హత్యలో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత సెప్టెంబరు 14న జరిగిన ప్రణయ్‌ హత్య కేసును తొమ్మిది నెలలపాటు విచారించిన తర్వాత బుధవారం చార్జిషీట్‌ దాఖలు చేశారు.
ఇక పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ అమృత పట్ల తండ్రి మారుతీరావు పెంచుకున్న పగను తెలియజేస్తుంది.

English summary
Eight persons have been charge-sheeted on Wednesday for the murder of Dalit youth Perumalla Pranay Kumar, who was killed for marrying an upper caste woman. The Nalgonda police have filed a 1600-page charge sheet detailing the sequence of events that led to the planned murder of the youth by hiring a contract killer.The police have named T Maruthi Rao as the prime accused for hatching the plot to kill Pranay, a Dalit from the Mala community for marrying his daughter Amrutha who belongs to the Vyshya caste. Along with him, Asghar Ali who was acquitted of terror charges, Mohammad Abdul Bari his associate and Subash Sharma the hired assassin from Bihar who committed the murder have also been charge sheeted. The Nalgonda police have also charge-sheeted Maruthi Rao's brother Sravan Kumar and his driver, Samudrala Shiva. Abdul Karim, a local Congress leader and transport operator who was the point of contact for Asghar and Bari, has also been charge sheeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X