వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: విషాహారం వల్లే ఏడుగురి మృతి, విషం కలిపిందేవరు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

యాదాద్రి: యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడానికి విషాహరమే కారణమని తేలింది. పోస్టుమార్టమ్ నివేదిక ప్రకారంగా మృతులు తిన్న ఆహరంలో విష నమూనాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.

Recommended Video

ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి, వీడియో !

రెండు రోజుల క్రితం యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలోని కోళ్ళపారం ఆవరణలో ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు.వీరి మృతిని పోలీసులు అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే మృతదేహలకు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత విషాహరం తినడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు గుర్తించారు. అయితే వారు తిన్న ఆహరంలో విషం ఎలా కలిసిందనే విషయమై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

విషాహరం వల్లే మృతి

విషాహరం వల్లే మృతి

యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో కోళ్ళపామ్‌లో పనిచేసే కుటుంబం అనుమానాస్పదస్థితిలో రెండు రోజుల క్రితం మరణించింది. ఈ మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహలకు చేసిన పోస్ట్‌మార్టమ్‌లో వచ్చిన నివేదిక పోలీసుల దర్యాప్తుకు కొంత సహకరించింది. విషాహరం వల్లే ఏడుగురు మరణించారని నివేదికలు తెలుపుతున్నాయి.

శవమే వస్తోందో

శవమే వస్తోందో

రేషన్ బియ్యం కోసం తన స్వంత గ్రామం మునిగడపకు బాలరాజు వెళ్ళాడు. అయితే ఆ సమయంలోనే తల్లిదండ్రులను కలిసాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే బాలరాజు ఆవేదనను తల్లిదండ్రులతో వ్యక్తం చేశారని అంటున్నారు. తన శవం వస్తోందోమోనని అన్నాడని గ్రామస్థులు గుర్తు చేసుకొంటున్నారు. బాలరాజు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

చికిత్స కోసం వెళ్ళకుండానే

చికిత్స కోసం వెళ్ళకుండానే

బాలరాజుకు మూర్చవ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి కోసం చికిత్స చేయించుకోవడానికి రెండు రోజుల క్రితమే వైద్యుడి వద్దకు వెళ్ళాల్సి ఉంది. కానీ, వైద్యుడి వద్దకు వెళ్ళాల్సిన రోజునే వారు చనిపోయిన విషయం వెలుగు చూసింది.

విషం ఎవరు కలిపారు

విషం ఎవరు కలిపారు

బాలరాజు కుటుంబసభ్యులు తిన్న ఆహరంలో ఎవరు విషం కలిపారనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలరాజు కుటుంబసభ్యుల్లోనే ఎవరైనా తినే ఆహరంలో విషం కలిపారా, లేదా పొరపాటున విషం వారు తినే ఆహరంలో కలిసిందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Seven members of a family, including three children were found dead under suspicious circumstances at a private poultry farm in Rajapeta mandal headquarters, about 85 kms from Hyderabad on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X