మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈత: ఒకే ఫ్యామిలీకి చెందిన 7గురు మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: సెలవుల్లో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్ట హషీమాద్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి వార్డుబాయ్ ఆహ్మద్ బేగ్ కుటుంబ సభ్యులు ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో గల ఉస్మాన్‌మియా అనే బంధువు ఇంటికి సెలవుల నిమిత్తం వెళ్లారు. అక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గల గౌరమ్మ చెరువుకు వెళ్లి సేద తీరేందుకు టవేరా వాహనంలో 13 మంది బయలుదేరారు.

చెరువు దగ్గరకు వెళ్లిన తర్వాత ముస్కాన్‌బేగం అనే మహిళ ముందుగా చెరువులోకి దిగింది. కొంత లోపలికి వెళ్లిన ఆమె నీట మునిగింది. ఆమెను రక్షించేందుకు బాసిత్, సల్మాన్ కూడా చెరువులోకి దూకారు. వీరికి కూడా ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. రక్షించే క్రమంలో ఒకరి వెంట మరొకరు చెరువులోకి దిగి నీట మునిగిపోయారు.

మృతుల్లో రుఖియాబేగం (25), నుస్రత్ ఫాతిమా (19), ముస్కాన్‌బేగం (35), బాసిత్ (38), రహమాన్ (20), మున్నా (18), సల్మాన్ (23) ఉన్నారు. మొత్తం 13 మందిలో ఏడుగురు నీట మునిగి మృతి చెందగా ఆరుగురు చెరువు కట్టపై ఉండి పెద్దగా కేకలు వేస్తూ రక్షించాలంటూ రోదించారు. స్థానికులు చెరువు దగ్గరకు పరుగులు తీసి మృతదేహాలను బయటకు తీశారు.

ఈ దుర్ఘటన సమాచారం జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లాలని జిల్లా మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టికె శ్రీదేవి ఘటనా స్థలానికి చేరుకుని గౌరమ్మ చెరువును పరిశీలించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అప్రమత్తంగా ఉండండి: కెసిఆర్ దిగ్భ్రాంతి

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

సెలవుల్లో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

హైదరాబాద్ ఫలక్‌నుమాలోని హజీబుల్ కాలనీలో నివసిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి వార్డుబాయ్ ఆహ్మద్ బేగ్ కుటుంబ సభ్యులు ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలో గల ఉస్మాన్‌మియా అనే బంధువు ఇంటికి సెలవుల నిమిత్తం వెళ్లారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

అక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గల గౌరమ్మ చెరువుకు వెళ్లి సేద తీరేందుకు టవేరా వాహనంలో 13 మంది బయలుదేరారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

చెరువు దగ్గరకు వెళ్లిన తర్వాత ముస్కాన్‌బేగం అనే మహిళ ముందుగా చెరువులోకి దిగింది.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

కొంత లోపలికి వెళ్లిన ఆమె నీట మునిగింది. ఆమెను రక్షించేందుకు బాసిత్, సల్మాన్ కూడా చెరువులోకి దూకారు. వీరికి కూడా ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

రక్షించే క్రమంలో ఒకరి వెంట మరొకరు చెరువులోకి దిగి నీట మునిగిపోయారు.

చెరువులు, బావులలో ఈత కెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచించారు. బుధవారం ఏడుగురు కుటుంబసభ్యులు ఈత కెళ్లి మృతి చెందిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇలాంటి సంఘటనలు వేసవికాలంలో తరచుగా జరగడం బాధకలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈతకెళ్లే పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు, స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

English summary
Seven members of a family, including four young women, drowned in a lake in Mahabubnagar district of Telangana this afternoon, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X