జూబ్లీహిల్స్ లో స్పా ముసుగులో సెక్స్ దందా.. ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
భాగ్యనగరి కేంద్రంగా హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల స్పాలు, బ్యూటీ పార్లర్లు, అపార్ట్ మెంట్ లలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నగరం నడిబొడ్డున బ్యూటీపార్లర్లు, స్పా లను అడ్డాలుగా చేసుకుని సాగుతున్న వ్యభిచార దందాను వెలుగులోకి తెచ్చారు పోలీసులు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఒక స్పా లో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
హైదరాబాద్ లో ఈ ఏరియా, ఆ ఏరియా అని లేకుండా అన్ని చోట్ల యధేచ్చగా వ్యభిచారం జరుగుతుంది. తాజాగా అమాయకమైన అమ్మాయిలని తమ ట్రాప్ లోకి లాగి వారితో వ్యభిచారం దందా చేయిస్తూ డబ్బులు దండుకుంటున్న ఒక స్పా నిర్వాహకులను, అందులో వ్యభిచారం చేస్తున్న 9మంది అమ్మాయిలను, ఇద్దరు కస్టమర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు .ఇక ఈ సెక్స్ రాకెట్ పై సమాచారంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడ జరుగుతున్న దందా చూసి షాక్ అయ్యారు.

కస్టమర్ లాగా ఫోన్ చేసిన పోలీసులకు నిర్వాహకులు అక్కడ అమ్మాయిలతో క్రాస్ మసాజ్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. ఇక అమ్మాయిలతో ఏకాంతంగా గడపాలంటే కూడా ఓకే అని చెప్తూ అందుకు కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందని ఆఫర్ చేశారు. దీంతో పోలీసులు సదరు స్పాలో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు . ఆపై పోలీసులు దాడి చేసి అక్కడ దందా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇక ఆక్కడ ఉన్న యువతులను రెస్క్యూ హోం కు తరలించారు. నిర్వాహకులు, విటులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాలలోనే వ్యభిచారం దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మియాపూర్ లో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ లో వ్యభిచార దందా చేస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫ్యామిలీలు ఉండే అపార్ట్మెంట్ లో ఎవరికీ అనుమానం రాకుండా సోషల్ మీడియా ద్వారా విటులను ఆకర్షించి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఫ్లాట్ పై దాడి చేసిన పోలీసులు ఇద్దరు అమ్మాయిలను, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడు.