హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో విదేశీవనితలతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు ... తొలిసారి కేసు నమోదు చేసిన ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. విదేశీ వనితలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పట్టుకుని ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు ఛత్రినాక పోలీసులు . ఛత్రినాక పోలీసుల సాయంతో తొలిసారి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ ముఠాను అదుపులోకి తీసుకుంది.

బంగ్లాదేశ్ యువతులతో హైటెక్ వ్యభిచారం

బంగ్లాదేశ్ యువతులతో హైటెక్ వ్యభిచారం

హైదరాబాద్ కేంద్రంగా విదేశీ వనితలతో వ్యభిచార దందా యధేచ్చగా సాగుతుంది. ఇక తాజాగా పాతబస్తీకి చెందిన యూసుఫ్‌‌ఖాన్‌, బేగం దంపతులు బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. విదేశీ వనితలను నగరానికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల దందా కొనసాగిస్తున్నారు. ఇక ఈ సెక్స్ రాకెట్ గురించి పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దాడిచేసి చత్రినాక పోలీసుల సహాయంతో రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు.ఇక అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశ్ యువతులను స్వదేశానికి పంపారు.అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు .

గతంలోనూ వ్యభిచార దందాలో పట్టుబడిన విదేశీ వనితలు

గతంలోనూ వ్యభిచార దందాలో పట్టుబడిన విదేశీ వనితలు

ఇక గతంలో కూడా హైదరాబాద్ లో విదేశీవనితలను వ్యభిచార కూపంలోకి దించిన ముఠాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఇటీవల పంజాగుట్టలోని పోలో లాడ్జిపైన దాడి చేసిన సమయంలో ఉజ్బెకిస్థాన్ కు చెందిన నలుగురు యువతులు, బెంగాల్ కు చెందిన యువతి, నలుగురు విటులు పట్టుబడ్డారు. ఇక ఇప్పుడు ఐదుగురు బంగ్లాదేశ్ యువతులు పట్టుబడ్డారు. ఇటీవల ఏప్రిల్ లో ఛత్రినాక వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన పోలీసులు అప్పుడు ఐదుగురు బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేశారు. వారిని సైతం స్వదేశానికి పంపేశారు . ఇక ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన వ్యవహారంలో అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఎన్ఐఏ ఇలాంటి కేసును తొలిసారి నమోదు చేయడం.

తొలిసారి సెక్స్ రాకెట్ పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ

తొలిసారి సెక్స్ రాకెట్ పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ

విదేశాల నుండి పెద్ద సంఖ్యలో యువతులు హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్న నేపధ్యంలో ఎన్ఐఏ ఈ దందా విషయంలో ప్రత్యేకమైన నిఘా పెట్టింది. విదేశీ యువతులు పట్టుబడడంతోనే ఎన్ఐఏ కేసు నమోదు చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.ఏది ఏమైనా తాజా పరిణామాలు ఎన్ఐఏ దృష్టి హైదరాబాద్ మీద ఉన్నట్టు .. డేగ కన్ను భాగ్య నగరంపైన వేసినట్టు అర్ధం అవుతుంది.

విదేశీవనితలతో వ్యభిచారం .. చెక్ పెట్టేందుకు ఎన్ఐఏ నిఘా

విదేశీవనితలతో వ్యభిచారం .. చెక్ పెట్టేందుకు ఎన్ఐఏ నిఘా

ఈ దేశం ఆ దేశం అన్న తేడా లేకుండా హోటళ్ళు, లాడ్జీలు, స్పాల ముసుగులో వ్యభిచార దందా భాగ్య నగరి కేంద్రంగా సాగుతుంది. పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేసినా ఈ దందాకు మాత్రం చెక్ పడటం లేదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన నిర్వాహకులు హైదరాబాద్లోని హోటల్స్ నిర్వాహకులతో కలిసి సాగిస్తున్న ఈ హైటెక్ వ్యభిచారంపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పుడు ఎన్ఐఏ కూడా నిఘా పెట్టటం విదేశీ వనితలతో సాగించే దందాకు చెక్ పెట్టటానికే అని అర్ధం అవుతుంది .

English summary
Hyderabad has a large number of prostitutes with foreign women. The latest is Yusuf Khan-Begum, who is committing adultery with five young women from Bangladesh. NIA officials attacked and apprehended them with the help of Chatrinaka police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X