• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమిత్ షా రాజకీయం ఇక తెలంగాణ గట్టునుంచి..! ముషీరాబాద్ నుంచి సభ్యత్వం, సెప్టెంబర్ 17న భారీ సభ..!!

|

హైదరాబాద్‌: తెలంగాణ లోక్ ఎన్నికల్లో నాలుగు కీలక స్థానాలు గెలుచుకున్న బీజేపి అంతే దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టీ కేంద్రీకరించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. అంతే కాకుండా ముషిరాబాద్ లోని పార్టీ అద్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ఇంటి చిరునామాతో అమీత్ షా తన సభ్యత్వాన్ని పొందనున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ లో బీజేపి అడుగులు ఎంత కీలకంగా మారబోతున్నయో అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణపై కమలం గురి..! నగరంలో సభ్యత్వం తీసుకోనున్న అమీత్ షా..!!

తెలంగాణపై కమలం గురి..! నగరంలో సభ్యత్వం తీసుకోనున్న అమీత్ షా..!!

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్యంగా నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ఊపును భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనికి కేంద్రం నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. బీజేపీ ఇటీవల చేపట్టిన సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్వయంగా పాల్గొన్న విషయం తెలిసిందే.

విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!

కరీంనగర్‌లో భారీ సభకు ఏర్పాట్లు..! అమిత్‌ షా, జేపీ నడ్డాను ఆహ్వానించాం..!!

కరీంనగర్‌లో భారీ సభకు ఏర్పాట్లు..! అమిత్‌ షా, జేపీ నడ్డాను ఆహ్వానించాం..!!

తెలంగాణలో త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో.. అమిత్‌ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పర్యటనపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లో జరిపే సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతో పాటు సీనియర్లు కూడా ఆహ్వానించామని వివరించారు. ఈ సభలో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్‌తో పాటు 20మంది నేతల వరకు అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 17న తెలంగాణలో భారీ సభ..! నిర్దారిస్తున్న స్ధానిక నేతలు..!!

సెప్టెంబర్ 17న తెలంగాణలో భారీ సభ..! నిర్దారిస్తున్న స్ధానిక నేతలు..!!

సెప్టెంబర్ 17న తెలంగాణలో భారీ సభను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన దినోత్సవ సభకు అమిత్‌షా వస్తారని చెప్పారు. మజ్లిస్ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ లక్ష్యమని కిషన్‌రెడ్డి చెప్పారు. అయోధ్య విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. కశ్మీర్ విభజన విషయంలో మెజార్టీ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. 370 రద్దును రాజకీయం చేయాలని కాంగ్రెస్‌ చూసిందన్నారు. కశ్మీర్ అభివృద్ధి బాట పడుతుందని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి..! నేరాలను అరికట్టాలంటే స్మార్ట్‌కార్డులు కావాలి..!!

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి..! నేరాలను అరికట్టాలంటే స్మార్ట్‌కార్డులు కావాలి..!!

కొత్త చట్టాలు, టెక్నాలజీతో సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లో సైబర్‌ సెక్యూరిటీ అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ఆయనతోపాటు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌, పలువురు నిపుణులు హాజరయ్యారు. సైబర్‌ నేరగాళ్ల అప్పగింతకు ఇతర దేశాలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్‌ క్రైం నేరగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దేశంలో నేరాలను అరికట్టేందుకు స్మార్ట్‌ కార్డ్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. సైబర్‌ టెక్నాలజీలో ఎదురువుతున్న సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

English summary
Amit Shah, the party's national president, has been a special focus for strengthening Telangana. Apart from accelerating the membership registration process, it is pushing the chief head of various parties in Telangana to join their party. In addition, Dr. K. It seems Ameet Shah will get his subscription with Laxman's home address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more