హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో మరింత సంతోషం, నేను అర్హుడినో కాదో తెలియదు: షారుక్ ఖాన్

తాను ఈ డాక్టరేట్‌కు అర్హుడినో కాదో తనకు తెలియదని, తన తల్లి పుట్టిన హైదరాబాదులో దీనిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను ఈ డాక్టరేట్‌కు అర్హుడినో కాదో తనకు తెలియదని, తన తల్లి పుట్టిన హైదరాబాదులో దీనిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ సోమవారం అన్నారు.

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఆయనకు సోమవారం నాడు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఉర్దూ వర్శిటీ ఆరో స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్‌‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Shah Rukh Khan Receives honorary doctorate from Urdu Varsity

ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ జాఫర్‌ యూనస్‌ సరేశ్‌ వాలా డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడారు. తనకు డాక్టరేట్‌ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్య, ఉర్దూ భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తన తల్లి హైదరాబాద్‌లో జన్మించిందన్నారు. తన తండ్రి ఉర్దూ పండితుడన్నారు.

ఎదుటివారికి ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని, జీవితంలో ముందుకెళ్లేటప్పుడు ఒక్కోసారి తల వంచాల్సి వస్తుందని, టైప్‌ రైటర్‌లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడం కష్టమని, అందుకే టైప్‌ చేసే సమయంలో ఆలోచించి జాగ్రత్తగా టైప్‌ చేయాలని, అదేవిధంగా జీవితంలో ఏం చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలన్నారు. ఏదైనా తప్పు చేశాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదన్నారు.

తన తల్లి పుట్టిన హైదరాబాదులో డాక్టరేట్ అందుకోవడం మరింత ఆనందమని, తన తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషించేవారని షారుక్ ఖాన్ అన్నారు.

English summary
Shah Rukh Khan Receives honorary doctorate from Urdu Varsity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X