వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ కాంగ్రెస్ కి ఆజాద్ ఆశా దీపం కాగ‌ల‌డా...?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భ‌విత‌వ్వం మార‌బోతుంది. పార్టీ ని ముందుండి న‌డిపించే నేత‌ను మార్చాల‌ని ఆ పార్టీ అదిష్టానం భావిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా ఉన్న రామ‌చంద్ర కుంతియాను తొల‌గించి ఆ స్థానంలో పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ నియ‌మించాల‌ని అదిష్టానం స‌మాలోచ‌న చేస్తోంది. గులాం న‌బీ ఆజాద్ గ‌న‌క తెలంగాణ కాంగ్రేస్ ప‌గ్గాలు చేప‌డితే పార్టీకి తిరుగు ఉండ‌దనే చ‌ర్చ ఆ పార్టీలో న‌డుస్తోంది.

గులాం న‌బీ ఆజాద్ టీ కాంగ్రెస్ పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టించ‌గ‌ల‌డా...?

గులాం న‌బీ ఆజాద్ టీ కాంగ్రెస్ పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టించ‌గ‌ల‌డా...?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు రాబోతున్నాయా ,,? పార్టీ పూర్వ వైభవం దిశ‌గా ప‌రుగులు పెడుతుందా..? నాయ‌కులంద‌రూ విభేదాలు మ‌రిచి ఒకే తాటిపైకి చేరుకోబోతున్నారా ..? తెలంగాణ నాయ‌కుల మ‌ద్య ఐక‌మ‌త్యం తీసుకొచ్చి ముందుండి న‌డిపే కొత్త కెప్టెన్ వ‌స్తున్నాడా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇంత‌కి తెలంగాణ కాంగ్రేస్ పార్టీకి ప‌ట్ట‌బోతున్న ఆ మ‌హ‌ర్ద‌శ క‌థాక‌మామిషు ఏంటో చూద్దాం.. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ను నియమించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు బాగా తెలిసిన నేత ఆజాద్..

కేసీఆర్ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు బాగా తెలిసిన నేత ఆజాద్..

ప్రస్తుత ఇన్ ఛార్జ్ కుంతియా స‌మ‌ర్థ‌వంతంగా పని చేయ‌డం లేదని భావించిన అధిష్టానం తాజాగా ఆజాద్ పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయంలేనందున తక్షణం తెలంగాణలో పార్టీ ప్రక్షాళన జరగాలని అధిష్టానం కోరుకుంటోంది. ఆ క్రమంలోనే కుంతియా స్థానంలో ఆజాద్ ను నియమించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆజాద్ వచ్చి టీ కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించగలరా...? ఇక్కడ పార్టీ బ‌లోపేతంగా లేనప్పుడు ఆజాద్ వచ్చి మాత్రం ఏం చేయగలరు...? బలమైన నాయకత్వంలేని పార్టీని ఎలా అధికారంలోకి తేగలరు...? లాంటి ప్రశ్నలు సహజంగానే వస్తాయి. అయితే, కుంతియాతో పోల్చుకుంటే ఆజాద్ అన్ని విధాల మెరుగైన నాయ‌కుడు. పైగా కేసీఆర్ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు కూడా బాగా ఎరిగిన నేత. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట. ఈక్వేషన్లు సెట్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇవన్నీ కచ్చితంగా టీ కాంగ్రెస్ కు క‌లిసి వచ్చే అంశాలే.

ఆజాద్ పాత సంబందాలు కొత్త స‌మ‌స్య‌ల‌కు దారి చూపితే ప్ర‌మాద‌మే..

ఆజాద్ పాత సంబందాలు కొత్త స‌మ‌స్య‌ల‌కు దారి చూపితే ప్ర‌మాద‌మే..

అయితే, ఆజాద్ రాకపై పార్టీలో చిన్నపాటి సందేహాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ఛార్జ్ గా ఉన్నప్పుడు ఇక్కడ కొందరు నేతలతో ఆజాద్ కు బాగా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అందులో ఒకరిద్దరు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, మీడియా యాజమాన్యాలు కూడా ఉన్నారు. అప్పట్లో వారి మాట బాగా చెల్లుబాటు అయ్యేది. వారంతా ఇప్పటికీ ఆజాద్ కు బాగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆజాద్ మళ్లీ ఇన్ ఛార్జ్ గా వస్తే వారి హవా మొదలవుతుంది. మళ్లీ కాంగ్రెస్ రాజకీయాల్లో వాళ్లదే కీలక పాత్ర అవుతుంది. పార్టీ రాజకీయాల్లో వాళ్లే చక్రం తిప్పుతారు. వారికి నచ్చిన వారిని ప్రోత్సహించడం... నచ్చనివారిని తొక్కేసే ప్రయత్నాలు కచ్చితంగా జరుగుతాయి. ఆజాద్ కూడా వారి మాట వినే అవకాశం ఉంటుంది. వారి ఇష్టాఇష్టాల మేరకు నిర్ణయాలు జరిగితే అది మరో సమస్యకు దారి తీసే అవకాశం లేకపోలేదు. అప్పుడు పార్టీ పరిస్థితి ఇప్పటి కంటే మరింత ఇబ్బందికరంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.

పార్ట కి పూర్వ‌వైభ‌వం తెచ్చే స‌త్తా, చ‌తుర‌త‌ ఆజాద్ కు ఉంది.

పార్ట కి పూర్వ‌వైభ‌వం తెచ్చే స‌త్తా, చ‌తుర‌త‌ ఆజాద్ కు ఉంది.

ఈ అంశాన్ని పక్కన పెడితే... ఎన్నికల ముందు ఆజాద్ రాక టీ కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కు విన్నింగ్ ఛాన్సెస్ పెరగడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. పార్టీ పై పట్టుకోసం కుస్తీలు పడుతోన్న నాయకులగణమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పొత్తుల విషయంలో సైతం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీతో పాటు, తెలంగాణ జనసమితి తో కాంగ్రెస్ పొత్తుల పై కూడా ఆజాద్ మార్కు రాజకీయం పని చేస్తుంది. ఎంఐఎం లాంటి పార్టీలు టీఆర్ఎస్ తో కలిసి వెళ్లడం పై పునరాలోచించే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఆజాద్ రాక టీ కాంగ్రెస్ కు లాభం చేస్తుందనే భావించవచ్చు.

English summary
in telangana congress party huge changes will be taking place. congress high command planing change the telangana incharge shartly. rc kunthiya leading congress head so far.. but high command feeling no expecting result from him. so kunthia replacing gulam nabi azad soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X