వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మాటలపై కేటీఆర్ కు గురి లేదా..! 100 సీట్లు రావా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కేటీఆర్ కు తండ్రి మాట మీద నమ్మకం లేనట్టా...!! | Oneindia Telugu

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల మాట మొదలు అభ్యర్థుల ప్రకటన దాకా వంద స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెబుతూ వచ్చారు ఆపార్టీ అధినేత కేసీఆర్. 119 స్థానాలకు గాను వంద స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తామని సవాల్ చేశారు. కేసీఆర్ "వంద" పై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశాయి. వందేమో గానీ ఈసారి టీఆర్ఎస్ కు అపజయం ఖాయమని జోస్యం చెప్పాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

మహాకూటమి ఆరోపణల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు కేటీఆర్. తన సవాల్ స్వీకరించే దమ్ము టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా అంటూ ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీతో గెలుస్తామనే నమ్మకముంది కాబట్టే తాను ఈ సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారింది.

 కేసీఆర్ 100.. కేటీఆర్ 60

కేసీఆర్ 100.. కేటీఆర్ 60

వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటుకు 60 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. ఈ సంఖ్యను మించి వంద స్థానాల్లో గెలుస్తామనేది కేసీఆర్ మాట. అయితే తాజాగా సరిపడా మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అదే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా దొరికింది. తండ్రేమో వంద వంద అని జపిస్తుంటే తనయుడు అరవై అనడానికి కారణాలేంటి? అంటే విజయావకాశాలపై నమ్మకం సన్నగిల్లిందా లేదంటే తండ్రి మాటపై నమ్మకం కుదరడం లేదా అంటూ మాటల దాడికి సిద్ధమవుతున్నారు.

<strong> తెరాసలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కుదుపు: మైండ్ గేమ్ వద్దని ఎంపీల తీవ్ర హెచ్చరిక </strong> తెరాసలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కుదుపు: మైండ్ గేమ్ వద్దని ఎంపీల తీవ్ర హెచ్చరిక

కేసీఆర్ నమ్మకమేంటి..!

కేసీఆర్ నమ్మకమేంటి..!

ప్రజా సంక్షేమ పథకాలను బేషుగ్గా అమలు చేస్తున్నామని.. అందుకే ప్రజల దీవెన తప్పకుండా ఉంటుందనేది కేసీఆర్ బలమైన నమ్మకం. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్.. పెన్షన్లు ఇలా ప్రతి ఒక్క పథకం ప్రజలకు చేరువయిందని విశ్వసిస్తున్నారు. అందుకే కారు గుర్తుకు గంపగుత్తగా ఓట్లు పడతాయని భావిస్తున్నారు. ఇక ఇంటర్నల్ సర్వేలు కూడా.. ఈ పోల్స్ టీఆర్ఎస్ కు ఆశాజనకంగానే ఉంటాయని చెప్పడం కేసీఆర్ "వంద" మాటకు బలం చేకూర్చాయని చెప్పొచ్చు.

తండ్రి మాట.. తనయుడి బాట

తండ్రి మాట.. తనయుడి బాట

అన్నీ లెక్కలు, సమీకరణాలు పక్కాగా చూసుకున్నాకే కేసీఆర్ "వంద" కు ఫిక్సయి ఉంటారు. అలాంటిది కేటీఆర్ 'సరిపడా మెజార్టీ' అనడం వెనక ఆంతర్యమేంటి? తండ్రి మాట మీద నమ్మకం లేనట్టా.. లేదంటే టీఆర్ఎస్ ప్రభావం తగ్గిందా? అంటూ కేటీఆర్ వ్యాఖ్యల మీద మాటల తూటాలు సంధిస్తున్నారు అపొజిషన్ నేతలు.
ప్రజా ఆశీర్వాద సభలకు వెళుతున్న కేటీఆర్ కు క్షేత్రస్థాయిలో విషయం అర్థమయి ఉండొచ్చని ఎద్దేవా చేస్తున్నారు.

అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం అంటూ సవాల్ విసిరిన కేటీఆర్.. మరి తండ్రి మాట 'వంద' కు ఎందుకు ఫిక్స్ కాలేకపోయారనేది మరో వాదన. ప్రజాబలం టీఆర్ఎస్ కు జోరుగా ఉందని చెబుతున్న కేటీఆర్.. వంద స్థానాల్లో గెలుస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

 రె'బెల్స్' ఘంటికలు.. తాజా పరిస్థితులు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కారణమా..!

రె'బెల్స్' ఘంటికలు.. తాజా పరిస్థితులు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కారణమా..!


కొన్నిచోట్ల టికెట్లు దక్కని అసంతృప్తులు కారు దిగి పార్టీలు మారుతున్నారు. మరికొన్నిచోట్ల రెబెల్స్ గా పోటీకి సిద్దమవుతున్నారు. అదలావుంటే పార్టీ టికెట్లు ఆశించినవారు.. ఇతరులకు టికెట్లిస్తే వారు సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. వీటన్నంటినీ బేరీజు వేసుకునే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నాయి ప్రత్యర్థి వర్గాలు. కేసీఆర్ లాగా కేటీఆర్ కూడా ఇంటర్నల్ సర్వేలు చేయించుకున్నాకే ఇలా డిసైడ్ అయ్యారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. బ్రహ్మాండమైన మెజార్టీ, సరిపడా మెజార్టీ లాంటి తండ్రీ తనయుల భిన్న వ్యాఖ్యలను ప్రచారాస్త్రంగా మలచుకునే పనిలో పడ్డాయి.

English summary
ktr talks comfortability majority going weapon to opposition parties. kcr saying that trs won hundred seats in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X