వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంషాబాద్: ఎలక్ట్రిక్ స్టవ్‌లో కిలో బంగారు ఆభరణాలు(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎలక్ట్రిక్ స్టవ్‌లో బంగారాన్ని తరలిస్తున్న దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్టవ్‌లో పెట్టిన కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం విమానాశ్రయానికి చేరుకున్న సదరు వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్‌లో కిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్నందుకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి ముంబైకి చెందినవాడని అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

Shamshabad airport customs officers seize gold from a smuggler

దొంగ అరెస్టు: 7 తులాల బంగారం స్వాధీనం

వరుస దొంగతనాలు చేస్తున్న నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి నగలు, నగదు, ఓ ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Shamshabad airport customs officers seize gold from a smuggler

కొత్తపేట హూడాకాలనీలో శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సరూర్‌నగర్ పోలీసులకు అనుమానాస్పదంగా ఆటోలో వెళ్తున్న రామకృష్ణ తారసపడ్డారు.పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు.

విచారణలో రామకృష్ణ వరుస దొంగతనాలు చేసేవాడిగా తేలింది. ఈ మేరకు పోలీసులు నిందితుడి నుంచి రూ. 10 వేల నగదు, అమెరికన్ డాలర్, 7 తులాల బంగారు ఆభరణాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

English summary
Shamshabad airport customs officers on Saturday seized gold from a smuggler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X