వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డికి షాక్: 'అవినీతిపై బాబు-కెసీఆర్‌లకు లేఖ'

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎర్ర చందనం కేసులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.

ఎర్రచందనంలో వారి ప్రమేయం ఉందని తాను అప్పుడు కోర్టుకు వెళ్లడం వల్ల, తాను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నానో అందరికీ తెలుసునని చెప్పారు. నాడు గ్లోబల్ టెండర్లు పిలవకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

Shankar Rao targets Kiran Kumar Reddy again

రూ.1,350 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించారన్నారు. ఇదే విషయమై తాను కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. మన న్యాయస్థానాలు బాగా పని చేస్తాయని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.

ఇప్పుడు ఏపీకి ఎర్ర చందనం ప్రధాన ఆయుధంగా మారిందన్నారు. ఉమ్మడి ఏపీలో భారీ అక్రమాలు జరిగాయని, ఈ అంశంపై తాను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లకు లేఖ రాస్తానని చెప్పారు. తద్వారా ఆయన కిరణ్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు.

English summary
Former Minister Shankar Rao on Wendesday targetted Former Chief Minister Kiran Kumar Reddy again. He said that he will write letters to Two Telugu State CM's over corruption in united Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X