వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ.. బీఆర్ఎస్‌తో ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి?

ఎమ్మెల్సీ కవితతో తమిళనాడుకు చెందిన ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. ఆయన బీఆర్ఎస్‌తో కలిసి పని చెయ్యనున్నారు అన్నది ఈ భేటీ సందర్భంగా ప్రధానంగా వినిపిస్తుంది.

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సీఎం కేసీఆర్ శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమైన కేసీఆర్ ఇప్పటికే పక్క రాష్ట్రాలలో కీలక నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించిన కేసీఆర్, ఫిబ్రవరి 5వ తేదీన నాందేడ్ వేదికగా బహిరంగ సభ నిర్వహించి కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు.

సరిహద్దు రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్

సరిహద్దు రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్


ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల పై ఫోకస్ పెట్టిన కేసీఆర్ తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా, చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీని విస్తరించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. నిన్న కేసీఆర్ సమక్షంలో ఒడిస్సా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గిరిధర్ గమాంగ్ తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గిరిధర్ గమాంగ్ ను ఒడిస్సా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.

కేసీఆర్ కుమార్తె కవితను కలిసిన శరత్ కుమార్

కేసీఆర్ కుమార్తె కవితను కలిసిన శరత్ కుమార్


ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడుకు చెందిన ఆలిండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ కెసిఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్న శరత్ కుమార్ దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం, లక్ష్యం, అజెండా వంటి అనేక అంశాలపై శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో మాట్లాడారు.

ఆలిండియా సమతావ మక్కల్ కచ్చి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందా?

ఆలిండియా సమతావ మక్కల్ కచ్చి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందా?

వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి శరత్ కుమార్ పనిచేయటానికి నిర్ణయం తీసుకున్నట్టు, అందులో భాగంగానే వీరు ఇరువురి సమావేశం జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆలిండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయినట్టు తెలుస్తుంది. మరి శరత్ కుమార్ బిఆర్ఎస్ తో కలిసి పనిచేసే విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు కేసీఆర్ కు టచ్ లో ఉన్నారు. మొత్తంగా వడివడిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ ను బలమైన రాజకీయ శక్తిగా మార్చే పనిలో ఉన్నారు.

ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!

English summary
Sharath Kumar met MLC Kavitha. Will All India Samatava Makkal Katchi with BRS work together in the coming elections? There will be a debate whether this is the reason for Sharath Kumar's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X