హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎప్పుడైనా.. ఎక్కడైనా: మహిళా టెక్కీల రక్షణ కోసం 'షీ సేఫ్' యాప్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైబరాబాద్ ఐటీ కారిడార్ పరధిలోని మహిళా ఉద్యోగుల రక్షణ కోసం సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 'షీ సేఫ్' అనే యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మంగళవారం గచ్చిబౌలి ఇన్ఫోసిస్ కార్యాలయంలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది.

ఐటీ కారిడార్‌లో తాజాగా నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితితో పాటు మహిళలకు మరింత భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడారు.

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాల వల్ల శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఐటీ కారిడార్‌లో పోలీసులకు సహకరిస్తూ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలకమైన పాత్రను పోషిస్తుండడం అభినందించతగ్గ విషమన్నారు.

దీంతో పాటు ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణ కోసం సురక్షిత ప్రయాణానికి ఏర్పాటు చేసిన షీ షటీల్ విజయవంతమైందన్నారు. షీ షటీల్ సేవలపై కౌన్సిల్ విస్తృతంగా అవగాహన కల్పించడంతో మహిళా ఉద్యోగులు అందరూ వాటిలో ప్రయాణిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పైలట్ ప్రాజెక్ట్ కింద షీ సేవ్ యాప్‌ను ప్రారంభించారు.

‘She Safe’ app launched by Cyberabad Security Council

'షీ సేఫ్' యాప్ పని చేస్తుందిలా?

* ఎమర్జెన్సీ సమయాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకున్నా యాప్ ద్వారా సమాచారం అందించవచ్చు.
* ఎమర్జెన్సీ సమయాల్లో ఈ యాప్ ద్వారా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు అలర్ట్‌లు అందించే విధంగా రూపొందించారు.
* ఈ యాప్‌లో ఉన్న ఆధునిక ఫీచర్స్ ఆపదలో ఉన్న సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేస్తాయి.
* ఆపదలో ఉన్న మహిళ ఆచూకీ ఖచ్చితంగా గుర్తిస్తుంది.
* ఐటీ కారిడార్‌లో పని చేసే మహిళలకే కాకుండా ప్రతీ మహిళకు ఈ యాప్ ద్వారా భద్రత కల్పించమే యాప్ లక్ష్యం.
* మరో నెల రోజులలో ఈ యాప్‌ను అందుబాటులోకి రానుంది.

English summary
‘She Safe’, an app developed exclusively for women’s safety was launched by the Society for Cyberabad Security Council (SCSC) on Tuesday. It was launched by the chairman of SCSC Cyberabad and Cybera-bad police commissioner, C.V. Anand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X