వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ పై కేసు పెట్టాలి .. ఆ పని షీ టీమ్స్ చెయ్యాలి ..బీజేపీ నేత కిషన్ రెడ్డి సంచలనం ... ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు నిన్నటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇక తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణతో తమ విమర్శలకు పదును పెడుతున్నారు. తాజా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మహిళలకు క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదు సీఎం కేసీఆర్ . దీంతో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి కెసిఆర్ పై ఆసక్తికర దాడికి దిగారు. వినేందుకు విడ్డూరంగానే ఉన్నా... కిషన్ రెడ్డి అన్న మాటలు అందరూ ఆలోచించేలానే ఉన్నాయి. అయినా కిషన్ రెడ్డి చేసిన వాదన ఏమిటన్న విషయానికి వస్తే...

ఉన్న పళంగా సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని, అది కూడా మహిళల రక్షణ కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఈ బాధ్యత తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. మహిళల హక్కులను కాలరాస్తున్నారన్న కోణంలోనే షీ టీమ్స్ కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఆసక్తికర వ్యాఖ్య చేశారు.ఆయనలా ఎందుకు అన్నారు అంటే..

She teams has to put a case on CM KCR ..BJP leader Kishan Reddy sensation ..why Because ?


కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణాలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్, నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినా తన క్యాబినెట్లో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. తొలి ప్రభుత్వం గడువు తీరకముందే మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండో దఫా ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించినా పూర్తి స్థాయి కేబినెట్ లేకుండానే ఏకంగా 66 రోజుల పాటు పాలన సాగించారు .ఇక తాజాగా క్యాబినెట్ ను ప్రకటించిన కేసీఆర్... మరో పది మంది

ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ పది మందిలో కూడా ఒక్కరంటే ఒక్క మహిళ కూడా లేరు. మహిళలపై లెక్కలేనన్ని ఆంక్షలు విధించే అరబ్ దేశాలు కూడా తమ ప్రభుత్వాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న తరుణంలో కేసీఆర్ మాత్రం తన కేబినెట్ లోకి మహిళలకు ఎంట్రీ ఇవ్వడం లేదు అన్నది కిషన్ రెడ్డి వాదన.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డి... మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకుండా మహిళలను అవమానపరిచేలా వ్యవహరిస్తున్న కేసీఆర్ పైన షీ టీమ్స్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కేసీఆర్ క్యాబినెట్లో గిరిజనులకు స్థానం లేకపోవడాన్ని కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. 66 రోజుల పాటు కేబినెట్ లేకుండానే పాలన సాగించిన కేసీఆర్ రెండు నెలల సమయం తీసుకుని కూడా తన పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థిక , రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించగలిగిన నేతలను గుర్తించలేకపోయారని కూడా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుండి కోలుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.కిషన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

English summary
The defeated BJP leaders in the early elections in Telangana are silent till yesterday. Now They are sharpening their words about the latest Cabinet expansion. Kishan Reddy shocking comment on the lack of opportunity for women as minister . He said that "To register a case against CM KCR, it is also speculated that the SheTeams, specially constituted by Telangana government for women protection, should take this responsibility " .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X