హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో షిర్డీ-హైదరాబాద్ బస్సు దగ్ధం: మూడేళ్ల చిన్నారి సజీవ దహనం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీ-హైదరాబాద్ బస్సు దగ్ధమైంది. షిర్డీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు హవేరి జిల్లాలోని హుమ్నాబాద్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుంది. ఈ బస్సు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సజీవ దహనం కాగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మూడేళ్ల బాలుడు సజీవ దహనం
ఈ అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు వెనుక నుంచి తప్పించుకున్నారు. కానీ రియాన్ అనే మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి రియాన్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తణుకుగా గుర్తించారు. అయితే బస్సులోని ప్రయాణికులు మాత్రం ఆందోళనకారులే నిప్పు పెట్టారని వార్తలు వచ్చాయి.

shirdi-hyderabad bus in fire

బస్సుకు ఎవరూ నిప్పంటించలేదు: బీదర్ ఎస్పీ
ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సుకు ఎవరూ నిప్పంటించలేదని, బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఘోరం జరిగిందని బీదర్ ఎస్పీ నికమ్ ప్రకాశ్ అమ్రీత్ వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారని, నలుగురికి గాయాలు అయ్యాయని, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.

ఘటన విషయం తెలియగానే అధికారులు స్పందించారని తెలిపిన ఆయన, ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని అన్నారు. ఆరోపణలు వస్తున్నట్టుగా ఎవరైనా నిప్పంటించారా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించిన తరువాతనే వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు.

ఇంజిన్‌‌లో మంటలు వ్యాపించడం వల్లే బస్సు దగ్ధం
ప్రమాద వార్త తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ క్షతగాత్రులను హుమ్నాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇంజిన్‌‌లో మంటలు వ్యాపించడం వల్లే బస్సు దగ్ధమైందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కాలిన గాయలతో ప్రాణాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రాథమిక చికత్స కూడా అందక బాధితులు బాధపడుతున్నారు.

తెలంగాణ మంత్రి మహేంద్రరెడ్డి ఆరా
ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ PY 01 CK 9522గా ఉంది. ప్రమాదానికి గురైన బస్సు స్లీపర్ బస్సుగా గుర్తించారు. బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ మంత్రి మహేంద్రరెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసారు.

విషయాన్ని తెలుసుకున్న కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పటికే హుమ్నాబాద్ బయలుదేరి వెళ్లగా, కర్ణాటక ప్రభుత్వ అధికారులతో తెలంగాణ అధికారులు చర్చించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సు ప్రమాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అన్నారు.

బస్సు డ్రైవర్ పరారీ
అగ్ని ప్రమాదానికి గురికాగా, విషయం మొట్టమొదట తెలుసుకున్న డ్రైవర్ బస్సులోని 32 మందినీ అలర్ట్ చేయకుండా బస్సును ఆపి పరారైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

English summary
shirdi-hyderabad bus in fire accident at humnabad in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X