వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీనటుడు శివాజీకి దుబాయ్‌లో చుక్కెదురు.. ఎయిర్‌పోర్టులో ఆపేసిన అధికారులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సినీ నటుడు శివాజీకి దుబాయ్‌లో చుక్కెదురైంది. ఆయన అమెరికా వెళ్లేందుకు ఎయిర్ పోర్టు వద్దకు రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అలంద మీడియా కేసులో శివాజీపై అన్ని ఎయిర్ పోర్టుల్లో లుక్ ఔట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి స్వదేశం తిరిగొచ్చే అవకాశం ఉంది.

shivaji stop dubai airport

అలంద మీడియా వ్యవహారంలో శివాజీ ఏ2గా ఉన్నారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు. అయితే ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించి ఎయిర్ పోర్టులో పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం దుబాయ్ వెళతానని కోరడంతో కోర్టు అంగీకరించింది. అక్కడినుంచి దొడ్డిదారిన అమెరికా వెళ్లాలని ప్రయత్నించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పడంతో శివాజీ ఖంగుతిన్నారు. అయితే ఇటీవల శివాజీ అమెరికా వెళ్లడం చర్చానీయాంశమవుతుంది. ఆయన ఎందుకు వెళ్తున్నారు ? ఏం చేస్తున్నారనే అంశం చర్చకు దారితీసింది.

లుక్ ఔట్ నోటీసులు ఉన్న శివాజీ తిన్నగా ఇండియా రాకుండా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనిని ఎయిర్ పోర్టులో అధికారులు ఆపినట్టు తెలుస్తోంది. తిరిగి ఇండియా వెళ్లిపోవాలని స్పష్టంచేసినట్టు సమాచారం. దీంతో ఆయన హైదరాబాద్ అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ దుబాయ్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు మాత్రం ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించే పరిస్థితి లేదని తెలుస్తోంది.

English summary
Cinema star Sivaji was spotted in Dubai. He arrived at the airport on his way to the US and was stopped by immigration officials. In the Alanda media case, Shivaji has issued lookout notices at all the airports. He was blocked by the authorities. This could mean his repatriation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X