హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ డబ్బు ఏమైంది?: కస్టడీలో నిజాలను వెల్లడిస్తోన్న బాబా, పరారీలో మోహన్ రెడ్డి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లైఫ్‌స్టైల్‌ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌ రెడ్డిని పూజల పేరుతో మోసగించి రూ. 1.33 కోట్లతో ఉడాయించిన శివానంద బాబా పోలీసుల కస్టడీలో నిజానిజాలను వెల్లడిస్తున్నాడు. ఈనెల 15న బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలోని లైఫ్‌స్టైల్‌ యజమాని మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పూజలు చేయడానికి కర్ణాటక రాజధాని బెంగుళూరు నుంచి శివానంద బాబా వచ్చిన సంగతి తెలిసిందే.

పెద్ద కథే ఉంది..!: హెర్బల్ బాబా నుంచి బురిడీ శివానందబాబా వరకు డబ్బును మూడింతలు చేస్తానని చెప్పడంతో మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ఉన్న దాదాపు 1.33 కోట్లను పూజలో పెట్టాడు. అనంతరం మత్తుమందు కలిపిన ప్రసాదం మధుసూదన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు ఇచ్చి పూజలో పెట్టిన డబ్బులను తీసుకుని శివానంద బాబా ఉడాయించాడు.

అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటలు తిరిగే సరికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని వద్ద కేవలం రూ. 1.19కోట్లనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాని మధుసూదన్‌రెడ్డి పూజలో రూ.1.33 కోట్లు పెట్టానని పోలీసులకు తెలిపారు.

 shivanand baba revels money where kept from life style building owner

దీంతో ఈ నెల 24న బంజారాహిల్స్‌ పోలీసులు శివనందబాబాతోపాటు అతనికి సహకరించిన దామోదర్‌, శ్రీనివాస్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని గత మూడు రోజులుగా విచారిస్తున్నారు. అయితే తాము తీసుకెళ్లింది రూ. 1.28 కోట్లని శివానందబాబా పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అయితే పోలీసులకు పట్టుబడిన సొమ్ము పోగా మిగతా రూ. 8 లక్షలు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాల్సిందిగా పోలీసులు తమనైదన శైలిలో శివానందబాబాను ప్రశ్నించారు. దీంతో బెంగళూరులో పట్టుబడ్డ గదిలోని సొమ్ము దాచిపెట్టానని శివానందబాబా చెప్పడంతో పోలీసు బృందం అక్కడికి వెళ్లింది.

కుటుంబాన్నే లేపేద్దామనుకున్నా: దొంగ బాబా, సినీ డైరెక్టర్‌కూ టోకరాకుటుంబాన్నే లేపేద్దామనుకున్నా: దొంగ బాబా, సినీ డైరెక్టర్‌కూ టోకరా

ఇక మిగిలిన డబ్బు విషమయై స్షష్టత రవాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మోహన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉండటం విశేషం. అసలు శివానంద బాబాను మధుసూధన్ రెడ్డికి పరిచయం చేసిందే మోహన్ రెడ్డి అంటూ వార్తలు వస్తున్నాయి.

మధుసూధన్ రెడ్డి వద్ద ఉన్న డబ్బుపై ఆశపడే బురిడీ బాబాను ఆయనకు పరిచయం చేశాడని అంటున్నారు. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమానిని బురిడీ కొట్టించిన బాబాతో పాటు మరో ఇద్దరు నిందితులను 24 గంట్లల్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేశారనే విషయం అంతుచిక్కడం లేదు.

'డబ్బు ఆశతో కాదు': బురిడీబాబా ఎందుకొచ్చాడంటే..!, కోర్టులో హాజరు'డబ్బు ఆశతో కాదు': బురిడీబాబా ఎందుకొచ్చాడంటే..!, కోర్టులో హాజరు

మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వంలోని ఓ రాజకీయ నాయకుడి మద్దతు ఉన్నట్లు మీడియా వార్తలు వస్తున్నాయి. ఈ కారణం చేతనే అతడిని పట్టుకోవడంలో పోలీసులు పెద్దగా ఆసక్తిని కనబర్చడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, శివానందబాబా కస్టడీ సమయం ముగుస్తుండడంతో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.

English summary
Shivanand baba revels money where kept from life style building owner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X