నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయనే పిలిచారు: డీఎస్‌కు కేసీఆర్ షాక్, దొరకని అపాయింట్‌మెంట్.. రేపు డౌటే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు

హైదరాబాద్: నేను ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింటుమెంట్ అడగలేదని టీఆర్ఎస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ బుధవారం సాయంత్రం వెల్లడించారు. వచ్చి కలవాల్సిందిగా ముఖ్యమంత్రే తనకు చెప్పారన్నారు. ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో కలవడం కుదరలేదని సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని తాను సీఎంవోకు చెప్పానని తెలిపారు. తనతో మాట్లాడాలని సీఎం పిలిచినప్పుడు తాను వ్యక్తిగత పనుల మీద ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. తనను మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదని చెప్పారు. కేసీఆర్ తనను కలవాలనుకుంటే పిలుస్తారన్నారు. నాకు ఏ సమస్యా లేదన్నారు. ముఖ్యమంత్రిని కలిస్తే మాత్రం వాస్తవాలను వివరిస్తారనని డీ శ్రీనివాస్ తెలిపారు.

డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవితడీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్‌కు కవిత

Shock to D Srinivas: No appointment of CM KCR

కాగా, డీ శ్రీనివాస్ మధ్యాహ్నం నుంచి కేసీఆర్ అపాయింటుమెంట్ కోసం వేచి చూసినా దొరకలేదని తెలుస్తోంది. దీంతో ఆయన పైవిధంగా మాట్లాడారని అంటున్నారు. తొలుత సాయంత్రం ఆరు గంటలకు మాట్లాడుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన సాయంత్రం వరకు వేచి చూసినా సీఎం కార్యాలయం నుంచి స్పందన రాలేదు. డీఎస్‌కు ఫోన్ చేసి సీఎంకు కుదరలేదని చెప్పారు. అంతేకాదు, రేపు అందుబాటులో ఉంటే చెబుతామన్నారు.

కొడుకుల కోసం తండ్రుల డ్రామా

టీఆర్ఎస్ పార్టీలోని డీ శ్రీనివాస్ ఎపిసోడ్ పైన కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం విమర్శలు గుప్పించారు. ఇది చిల్లర రాజకీయ ప్రయత్నమని ఆరోపించారు. కేసీఆర్, డీఎస్‌లు తమ కూతురు(కవిత), కొడుకు (అరవింద్)ల కోసం తండ్రుల మధ్య పోటీ అన్నారు. రెండు కుటుంబాల మధ్య పదవుల పంపకంలో భాగమే ఈ ఎపిసోడ్ అన్నారు.

English summary
TRS senior leader D Srinivas did not get Telangana Chief Minister K Chandrasekhar Rao's appointment on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X