వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ కు షాక్ .. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీం మెట్లెక్కిన తెలంగాణా సర్కార్

|
Google Oneindia TeluguNews

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది . కృష్ణా జలాల వినియోగంపై ఏపీ తెలంగాణ సర్కార్ మధ్య పోతిరెడ్డిపాడు విషయంలో తలెత్తిన వివాదం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ ... కీలక అంశాలు ఇవే !!నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ ... కీలక అంశాలు ఇవే !!

 ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణాసర్కార్ షాకింగ్ నిర్ణయం

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణాసర్కార్ షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను అదనంగా వినియోగించుకోవాలని రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే వృధా జలాలను మాత్రమే తాము వినియోగించుకోనున్నట్లుగా ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ ఈ విషయంలో మొదటి నుంచి విభేదించిన తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని టెండర్ ప్రక్రియ చేపట్టకుండా చూడాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఈ పిటిషన్లో పేర్కొంది.

 ఏపీ ప్రభుత్వం టెండర్ ల ప్రక్రియ అడ్డుకునే వ్యూహంలో తెలంగాణా

ఏపీ ప్రభుత్వం టెండర్ ల ప్రక్రియ అడ్డుకునే వ్యూహంలో తెలంగాణా

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలాగైనా చేపట్టి తీరుతామని భావించిన ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాంతానికి అందించాలని నిర్ణయం తీసుకుంది .దీనికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గతంలో ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో, అధికారిక వర్గాలతో కృష్ణ వాటర్ బోర్డు కూడా సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు వెళుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

 గతంలో కృష్ణా వాటర్ బోర్డులోనూ పంచాయితీ

గతంలో కృష్ణా వాటర్ బోర్డులోనూ పంచాయితీ

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై, అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుపుతున్నారని ఎదురుదాడి చేసింది.అనుమతిలేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని కృష్ణానది యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది.

 సీఎం కేసీఆర్ సీరియస్ ... సుప్రీంను ఆశ్రయించాలని ఆదేశం

సీఎం కేసీఆర్ సీరియస్ ... సుప్రీంను ఆశ్రయించాలని ఆదేశం

నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల శక్తి శాఖ ప్రతిపాదించినప్పటికీ, సీఎం కేసీఆర్ ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల హాజరు కాలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియపై ముందుకెళితే సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, న్యాయపోరాటం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయరాదని నీటిపారుదల శాఖ సమీక్షలో స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి రాయలసీమకు నీరు అందించాలని నిర్ణయం తీసుకున్న విషయంలో తెలంగాణా ప్రభుత్వం మొదట నుండి సీరియస్ గానే ఉంది.

Recommended Video

Upasana Konidela On Chenchu Tribes Life Style | మాంసం తినండి.. కానీ..!
 సుప్రీంకోర్టులో పిటీషన్ ... ఏపీ సర్కార్ తో సమరానికి సై అంటున్న తెలంగాణా

సుప్రీంకోర్టులో పిటీషన్ ... ఏపీ సర్కార్ తో సమరానికి సై అంటున్న తెలంగాణా

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందుకు అడుగులు వేస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి డిజిటల్ విధానంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు వేదికగా సమరానికి సై అంటోంది తెలంగాణ ప్రభుత్వం.

English summary
Water dispute between AP and Telangana states is still ongoing.However, the Telangana government has approached the Supreme Court and filed a petition in the wake of the latest AP government going ahead with the Rayalaseema lift irrigation scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X