వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు భారీ షాక్: కారెక్కేందుకు రావుల బేరసారాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు బేరసారాలు సాగిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రావుల చంద్రశేఖర రెడ్డి తెలంగాణలో టిడిపికి బలమైన గొంతునిస్తూ వస్తున్నారు. ఆయన కూడా పార్టీని వీడితే టిడిపిపై పెద్ద దెబ్బనే పడుతుంది. తనకు ఎమ్మెల్సీ లేదా ఇతరత్రా ఏ పదవులు అక్కర్లేదని కేవలం తనకు రాజ్యసభ సీటు ఇస్తే తెరాసలోకి వస్తానని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో చెప్పినట్లు సమాచారం.

రావుల చంద్రశేఖర రెడ్డి టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విలువైన సలహాలు, సూచనలు ఇచ్చే మేధావిగాపేరు తెచ్చుకున్నారు. అంతేకాదు గతంలో రాజ్యసభకు ఎంపికైన రావుల చంద్రబాబుకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా వున్నారు. రాజ్యసభ కాలం ముగియడంతో రావుల 2004 సాధారణ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా వన పర్తి నుంచి ఓటమి చవిచూశారు.

Shock to Chandrababu: Ravula may join in TRS

2009లో విజయం సాధించి తన సత్తాను చాటుకున్నా రు. 2014 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఓటమిని చవిచూశారు. సాధారణ ఎన్నికల్లో తర్వా త తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారడంతో ఆ పార్టీలో వుండి లాభం లే దనే నిర్ణయానికి నేతలు వస్తున్నట్లు తెలుస్తోంది. రావుల చంద్రశేఖర రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

సీనియర్ నేత వున్న మోత్కుపల్లితో పాటు రావులకు గవర్నర్‌తో పాటు కేంద్ర స్థాయిలో ఏదో ఒక పదవి ఇప్పిస్తారని ఆశించారు. అవి అమలయ్యే సూచనలు కనిపించకపోవడంతో రావుల కారెక్కెందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇటీవలే తెరాసలో చేరిన టీటీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా రావులకు మంచి సహచరుడు. ఈ కారణంతో ఎర్రబెల్లి కూడా రావులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

English summary
It is said that Telugu Desam party (TDP) Telangana senior leader Ravula Chandrasekhar Reddy may join in Telangana Rastra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X